ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్వేది ఆలయంలో భక్తుల సందడి

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:56 AM

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శని వారం భక్తులు పోటెత్తడంతో సందడి నెలకొంది.

అంతర్వేది, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శని వారం భక్తులు పోటెత్తడంతో సందడి నెలకొంది. స్వామివారి నిత్యాభిషేకం, సుదర్శన హోమాల్లో భక్తులు పూజలు చేశారు. ఆలయం లోపల వేపచెట్టు చుట్టూ కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ముడుపులు కట్టారు. అయ్యప్ప మాలధారులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నిత్యాన్నదానంలో పాల్గొన్నారు.

నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం: నిత్యాన్న దాన ట్రస్టుకు కాకినాడకు చెందిన కొప్పిశెట్టి వెంకటరమణ, కుటుంబ సభ్యులు రూ.1,11,116 విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్‌ పి.విజయసారథి చేతులమీదుగా అందించినట్టు తెలిపారు. దాతలకు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది కిరణ్‌, గుత్తుల శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:56 AM