‘చిన్నారుల హక్కులను కాపాడాలి’
ABN, Publish Date - Nov 18 , 2024 | 12:26 AM
పిఠాపురం. నవంబరు 17(ఆంధ్రజ్యోతి): చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మీ అన్నారు. బాలల హక్కులు, ప్రజా చైతన్య వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలికల
పిఠాపురం. నవంబరు 17(ఆంధ్రజ్యోతి): చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆం ధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు టి.ఆదిలక్ష్మీ అన్నారు. బాలల హక్కులు, ప్రజా చైతన్య వారోత్సవాల్లో భాగంగా పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో మ హిళా శిశు సంక్షేమశాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, జిల్లా బాలల పరిరక్షణ విభా గం ఆధ్వర్యంలో ఆదివారం అవగాహనా సదస్సు ఏర్పాటు చేశా రు. బాలల హక్కులు, పరిరక్షణ, సురక్షితమైన స్పర్శ, చెడు స్పర్శ, బాల్య వివాహాలా నిరోధం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బా ల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. బాలలును వేధింపులకు గురిచేసినా, బాలకార్మికులు పనిచేస్తున్నట్టు తెలిసినా 1098 ఉచిత ఫోన్‌కు సమాచారం అందించాలని కోరారు. చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, శిశుగృహ మేనేజరు నూకరత్నం పాల్గొన్నారు.
Updated Date - Nov 18 , 2024 | 12:26 AM