ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అరబిందో బకాయిలను తక్షణం చెల్లించాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:06 AM

104 అంబులెన్సు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు డిమాండు చేశారు.

అమలాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): 104 అంబులెన్సు సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు డిమాండు చేశారు. ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఐవీ ధర్నా శిబిరంలో పాల్గొని మద్దతు తెలిపారు. 104 సిబ్బంది న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. 104సిబ్బంది ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అరబిందో యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గుదే దుర్గాప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరామ్‌, ఉపాధ్యక్షుడు భాస్కరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు, ధర్నా శిబిరంలో మాట్లాడారు. ధర్నాలో ఉద్యోగ సంఘ నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎస్తేరు రాణి, సీత, దైవకృప, పి.చంద్రశేఖర్‌, పి.త్రిమూర్తులు, బి.శ్రీనివాసరావు, కె.ఓంప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:06 AM