రాష్ట్రంలో బ్యాంక్‌ను నెంబర్‌వన్ చేయడమే లక్ష్యం
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:40 AM
రాజమహేంద్రవరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను రాష్ట్రం లో నెంబర్‌వన్ చేయడమే లక్ష్యమని, గత ఐదేళ్ల లో వైసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన నామినేటెడ్ పాలకవర్గం బ్యాంక్‌ను దివాళా వైపు నడిపించిం దని, డిపాజిట్ల సేకరణ లేదని, అప్పులు కూడా వసూలు చేయలేదని, అవ
ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు
రాజమహేంద్రవరం, అక్టోబరు9(ఆంధ్రజ్యోతి): ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్‌ను రాష్ట్రం లో నెంబర్‌వన్ చేయడమే లక్ష్యమని, గత ఐదేళ్ల లో వైసీపీ ఆధ్వర్యంలో పనిచేసిన నామినేటెడ్ పాలకవర్గం బ్యాంక్‌ను దివాళా వైపు నడిపించిం దని, డిపాజిట్ల సేకరణ లేదని, అప్పులు కూడా వసూలు చేయలేదని, అవకతవకలకు పాల్పడిం దని ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు తెలిపారు. రాజమహేంద్రవరం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ డిపాజిట్లు రూ.1000కోట్లకు, రుణాలు రూ.750కోట్ల వరకూ ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత పాలకవర్గం నిర్వాకం వల్ల 7శాతం ఉండాల్సిన ఎన్‌పీఏను 20 శాతానికి చేసేయడంతో రిజర్వుబ్యాంక్ ఈ బ్యాం క్‌ను సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్కులో పెట్ట డంవల్ల నాలుగేళ్లుగా సభ్యులకు డివిడెండ్లు ఇవ్వ డం లేదన్నారు. ఈ బ్యాంక్‌ను సిక్‌అండ్‌వీక్ బ్యాం క్‌గా రిజర్వు బ్యాంక్ పరిగణించడంవల్ల జూలై 23వతేదీకి ఎన్‌పీఏ 22శాతం, నెట్ ఎన్‌పీఏ 12.84శాతంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ బ్యాంక్‌ను రిజర్వుబ్యాంక్ ఇంకా సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్కు(శాప్)లో ఉంచిందన్నారు. కూటమి పాలకవర్గం వచ్చి 75రోజులు అయింద ని, తాము లోన్లు రూ.35కోట్లకు పెంచామన్నారు. వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ గత పాలకవర్గంలో షాడో చైర్మన్‌గా వ్యవహరించిన ఒక వ్యక్తివల్ల బ్యాంక్ దెబ్బతిందన్నారు. డైరెక్టర్ యెనుమల రంగబాబు మాట్లాడుతూ గత నామి నేటెడ్ బాడీ కొనుగోలు చేసిన గిఫ్ట్‌ల్లోను అవినీతి కి పాల్పడిందని, తప్పుడు ఆరోపణలతో బ్యాంక్ సభ్యులను మానసిక క్షభకు గురి చేయడం తప్ప ఏమీ చేయలేదన్నారు. సమావేశంలో నీలపాల సత్యనారాయణ, పిల్లి శ్యామ్, యాళ్ల కుమార స్వామి, బుడ్డిగ రవి, పడాల శ్రీనివాస్, సింగం పల్లి రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Oct 10 , 2024 | 01:40 AM