ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:58 AM

జిల్లాకలెక్టర్‌ కార్యాలయం సోమవారం దీక్షలు ,ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్‌ కాఫీ ప్రకారం జీవోల సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్‌ చేస్తూ ఏపి ఆశ వర్కర్స యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలు

రాజమహేంద్రవరం రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాకలెక్టర్‌ కార్యాలయం సోమవారం దీక్షలు ,ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్‌ కాఫీ ప్రకారం జీవోల సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని డిమాం డ్‌ చేస్తూ ఏపి ఆశ వర్కర్స యూనియన్‌ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు.యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటలక్ష్మి, గౌరవ అధ్యక్షుడు ఎం . సుందర్‌బాబు మాట్లాడారు. ప్రభుత్వ విధానా లతో ఆశ వర్కర్లు తీవ్రంగా నష్టపోతున్నార న్నారు.ఇటీవల రిటైర్మెంట్‌ అయిన వర్కర్స్‌కు బెనిఫిట్స్‌ రూ.60వేలు అందలేదని, 60 ఏళ్ళు నిం డిన వారు రెండేళ్ల వయోపరిమితి పెంపుదలకు అనర్హులుగా మిగిలిపోయారన్నారు. ఇటివల మరణించిన ఆశవర్కర్లకు మట్టి ఖర్చులు రూ.20 వేలు అందలేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీచేయాలని కోరారు.అనంతరం యూనియన్‌ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి వినతిపత్రం అందించారు. ధర్నాకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, బి.పవ న్‌, వై.బేబిరాణి, జువ్వల రాంబాబు మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో మేరి, టి.రామతులసి, టి.నాగమణి, పి.అనూష, ఏ.ధనలక్ష్మి, కే.వెంకట లక్ష్మి, ఎం.హవీలకుమారి పాల్గొన్నారు.

108 సిబ్బంది దీక్ష

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్‌ సర్వీసు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 108 సిబ్బంది కలెక్టరేట్‌ వద్ద దీక్ష చేశారు. 8 ప్రధాన డిమాండ్ల ధర్నా చేస్తున్నామని.. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 25వ తేదీ తర్వాత సమ్మెకు దిగుతామని అన్నారు. సీఐటీయూ సెక్రటరీ పూర్ణిమారాజు సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్ష విర మింపజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌వీ.రమణ, గుజ్జుల రమేష్‌ బాబు,నానాజీ,వెంకటేశ్వరరావు, రమేష్‌ నాయు డు, శ్రీధర్‌, జగపతి, నంది రాజు, సునీత ,శ్రా వణి, సుమలత విజయ్‌ దీక్ష చేశారు.

Updated Date - Nov 19 , 2024 | 12:58 AM