ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతిభావంతులకు ‘నన్నయ’ చక్కని వేదిక

ABN, Publish Date - Dec 14 , 2024 | 01:39 AM

దివాన్‌చెరువు, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయం విద్యకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవా

క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభిస్తున్న రిజిస్ట్రార్‌ సుధాకర్‌

రిజిస్ట్రార్‌ సుధాకర్‌

అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ప్రారంభం

దివాన్‌చెరువు, డిసెంబరు13 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌ అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా నన్నయ విశ్వవిద్యాలయం విద్యకళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్‌ క్రీడాకారుల వందనాన్ని స్వీకరించారు. క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2రోజులపాటు జరిగే ఈ పోటీలకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ధృఢమైన విశ్వవిద్యాలయ జట్టుగా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అథ్లెటిక్స్‌లోని రన్నింగ్‌, జంపింగ్‌, త్రోయింగ్‌ వంటి 24 ఈవెంట్స్‌లో పురుషులకు, మహిళలకు పోటీలు జరుగుతాయని తెలిపారు. అనంతరం హాఫ్‌ మారథాన్‌(21 కిలోమీటర్లు) మహిళ పరుగు పందెంలో మొదటి మూడుస్థానాలు సాధించిన జి.పావని(ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం) ఎస్‌.సౌమ్యశిరీష(ఏఎస్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ), బి.నాగలక్ష్మిదుర్గ(ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం)లకు పతకాలు అందజేసి అభినందించారు. పురుషుల విభాగంలో మొదటి మూడు స్థానాలు సాధించిన బి.సురేష్‌ (ఎస్‌సీఐఎండీసీ, తణుకు)ఎ.మోహనకృష్ణ ప్రసాద్‌ (డీఎన్‌ఆర్‌ కళాశాల, భీమవరం) పి.సాయిరామ్‌(డిగ్రీ కళాశాల, భీమడోలు)కు పతకాలను అందజేసి అభినందించారు. అలాగే డిస్కస్‌ త్రో మహిళా విభాగంలో సీహెచ్‌ శోభారాణి (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం), ఎస్‌.శ్రీలక్ష్మీలావణ్య( నన్నయ విశ్వవిద్యాలయం) కె.శ్రీదేవి (ఎస్‌ఎస్‌ఆర్‌జీసీపీఈ, గోపన్నపాలెం) తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలను అందుకున్నారు. తరువాత ఐదు వేల మీటర్లు వాకింగ్‌ రేస్‌లో మహిళా విభాగంలో ప్రతిభ కనబరచిన వి.నాగలక్ష్మి, సీహెచ్‌.ఝూన్సీదుర్గ, ఎస్‌.పుష్పలతలకు పతకాలు ప్రదానం చేశారు. ఇరవై వేల మీటర్లు వాకింగ్‌ రేస్‌ పురుషుల విభాగంలో ప్రతిభ కనబరచిన బి.జీవన్‌కుమార్‌, యు.భీమయ్య, ఎన్‌.హేమసాయిలకు పతకాలు అందజేసి అభినందించారు. మిగిలిన క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు పి.సురేష్‌వర్మ, ఎన్‌.ఉదయభాస్కర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఎస్‌.లింగారెడ్డి, కార్యనిర్వాహక చైర్మన్‌ కె.సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శి చొల్లంగి వెంకట సుబ్రహ్మణ్యం, పరిశీలకులు సాల్మన్‌ దేవానంద్‌, వ్యాయామవిద్య అధ్యాపకులు బాలసత్యనారాయణ, బి.రామ్‌గోపాల్‌, ఫణీంద్ర, మూర్తి, డీఎన్‌ఆర్‌ కళాశాల పీడీ రాజు ఉన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 01:39 AM