ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భక్తవత్సల గోవిందా

ABN, Publish Date - May 26 , 2024 | 01:31 AM

: కోనసీమ తిరుమల వాడపల్లికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే సుప్రభాతసేవ, ఐశ్వర్యలక్ష్మీహోమం, బాలభోగం నిర్వహించి శ్రీవేంకటేశ్వరస్వామిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు.

వాడపల్లికి పోటెత్తిన భక్తులు

స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.38.43 లక్షలు

ఆత్రేయపురం, మే 25: కోనసీమ తిరుమల వాడపల్లికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే సుప్రభాతసేవ, ఐశ్వర్యలక్ష్మీహోమం, బాలభోగం నిర్వహించి శ్రీవేంకటేశ్వరస్వామిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు తిరువీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తులాభారాలు, కానుకలు, తలనీలాలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. బాల బ్రహ్మానంద సరస్వతి శ్రీవేంకటేశ్వరస్వామి మహత్యాన్ని వివరించారు. మల్టీ జోన్‌-2 ఆర్జేసీ ఎం.విజయరాజు, దేవ దాయశాఖ అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.38.43లక్షలు లభించినట్టు ఉప కమిషనరు, ఈవో భూపతిరాజు కిషోర్‌కుమార్‌ తెలిపారు.

కిక్కిరిసిన శృంగారవల్లభస్వామి ఆలయం

పెద్దాపురం, మే 25: కాకినాడజిల్లా పెద్దాపురం మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి భక్తులు తెల్లవారు జామునే బారులు తీరారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,57,460, అన్నదాన విరాళాలు రూ. 69,805 ఆదాయం, కేశఖండన ద్వారా రూ. 7,640 తులాభారం రూ.250, వెరసి రూ.3,35,155 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థానం చైర్మన్‌ కర్రి జగదీష్‌, దేవస్థానం అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 01:31 AM

Advertising
Advertising