ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బిక్కవోలులో అంతర జిల్లాల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:42 AM

బిక్కవోలు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని బిక్కవోలు ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్‌ క్రీడాకారులకు సూచించారు. అంతర జిల్లాల బాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జడ్పీ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలో శుక్రవారం ఆయన ప్రారం

ఆడుతున్న శ్రీకాకుళం-పశ్చిమ గోదావరి జట్లు

బిక్కవోలు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని బిక్కవోలు ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్‌ క్రీడాకారులకు సూచించారు. అంతర జిల్లాల బాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జడ్పీ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముందుగా జాతీయ పతాకాన్ని, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. బిక్కవోలులో బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడను ప్రోత్సహించి ఎంతోమంది జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేసి ఉద్యోగవకాశాలు కల్పించిన జాతీయ క్రీడాకారుడు మానుకొండ వీర్రాఘవరెడ్డి సేవలను ఎస్‌ఐ కొనియాడారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి వచ్చిన బాలికా క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పి.వీరప్రభాకరరావు, పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వామి, జిల్లా డీఎస్‌డీవో శేషగిరిరావు, స్టేట్‌ అబ్జర్వర్‌ రజనీదేవి, పీడీల అసోషియేషన్‌ అధ్యక్షుడు ప్రసాద్‌, అనపర్తి జోన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, పీడీలు బంగార్రాజు, ధనరాజు, యు వరాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాఘవరెడ్డి, అప్పారెడ్డి, ప్రభాకరరెడ్డి, జావేద్‌, వీకేఆర్‌ తంబి పాల్గొన్నారు.

సెమీస్‌కు చేరిన శ్రీకాకుళం, గుంటూరు జట్లు

రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. మొత్తం జట్లను నాలుగు పూల్స్‌గా విడదీయగా శుక్రవారం జరిగి పోటీల్లో పూల్‌ ఏ నుంచి శ్రీకాకుళం జట్టు పశ్చిమ గోదావరిపై గెలుపొంది సెమీస్‌కు చేరింది. పూల్‌ సీ నుంచి గుంటూరు జట్టు కర్నూలుపై గెలిచి సెమీస్‌కు చేరుకుంది. వెలుతురు లేమి కారణంగా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన ప్రథమ, ద్వితీయ జట్లు పూల్‌ బిలో విజయనగరం-తూర్పుగోదావరి, పూల్‌ డిలో విశాఖ-ప్రకాశం జట్ల మధ్య జరగవలసిన సెమీ ఫైనల్‌ పోటీలు శనివారానికి వాయిదా వేశామని, ఈ పోటీలతో పాటు సెమీస్‌, ఫైనల్స్‌ నిర్వహించి పోటీలు ముగిస్తామని జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి స్వామి తెలిపారు.

Updated Date - Nov 30 , 2024 | 12:42 AM