బాల్ బ్యాడ్మింటన టోర్నీ విజేత ‘చిత్తూరు’
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:07 AM
క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రెండు రోజులు జరిగిన 68వ అంతర్ జిల్లాల అండర్-17 బాలుర బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో రెండు రోజులు జరిగిన 68వ అంతర్ జిల్లాల అండర్-17 బాలుర బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్స్‌లో చిత్తూరు జిల్లా టీమ్ విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. కృష్ణా జిల్లా టీమ్ రన్నర్‌గా నిలిచింది. 3వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా టీమ్, 4వ స్థానంలో విజయనగరం జిల్లా టీమ్ నిలిచాయి. ముగింపు సభలో డీఈవో మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ ఉందని, క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చన్నారు. సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు మాట్లాడారు. డీవైఈవో ఈవీబీఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డీఐ దిలీప్‌కుమార్, బాల్ బ్యాడ్మింటన్ సెలక్షన్స రాష్ట్ర పరిశీలకుడు తంబి, స్కూల్ గేమ్స్ కార్యదర్శి స్వామి, టోర్నమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఏవీడీ ప్రసాదరావు, దివంగత క్రీడాకారుడు ఎంవీవీబీ నాగేశ్వరరావు సతీమణి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 01:07 AM