Nara Bhuvaneswari: తూ.గో.జిల్లాలో నేడు భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన
ABN, Publish Date - Jan 26 , 2024 | 07:19 AM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
రాజమండ్రి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు. ఉదయం 10.10 గంటలకు బిక్కవోలు గ్రామం.. 12.30 గంటలకు నిడదవోలు మండలం పందలపర్రు గ్రామం.. 1.10 గంటలకు తిమ్మరాజుపాలెం.. 1.55 గంటలకు తాడిమళ్ళ గ్రామం.. సాయంత్రం 4.30 గంటలకు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, కాటానగరం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. అనంతరం నారా భువనేశ్వరి సాయంత్రం 5.30 గంటలకు మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అశువులు బాసిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు.
నారా చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టిన కుప్పం నుంచి ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు ఇదొక సెంటిమెంట్. దీన్నే టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అయ్యారు. యువగళం పాదయాత్రను ఇక్కడి నుంచే ఆరంభించారు. నారా భువనేశ్వరి కూడా కుప్పం నుంచే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Updated Date - Jan 26 , 2024 | 07:19 AM