ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీకి బిగ్‌ షాక్‌

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:30 AM

జిల్లాలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్‌.రాజీవ్‌కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన రాజీవ్‌కృష్ణ గురువారం ఉదయం అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

లోకేశ సమక్షంలో నేడు టీడీపీలో చేరనున్న రాజీవ్‌ కృష్ణ

ముగ్గురు జడ్పీటీసీలు, ఒక ఎంపీపీ, పలువురు నేతలు కూడా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ మాజీ సలహాదారు ఎస్‌.రాజీవ్‌కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన రాజీవ్‌కృష్ణ గురువారం ఉదయం అమరావతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు ముగ్గురు జడ్పీటీసీలు, ఒక ఎంపీపీ, పలువురు నేతలు టీడీపీలో చేరనున్నారు. వీరంతా ఇప్పటికే రాజధాని చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా నేతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు టీడీపీలో కింగ్‌ మేకర్‌గా వ్యవహరించి... 2012లో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల కృష్ణబాబు అల్లుడు రాజీవ్‌కృష్ణ అనే సంగతి అందరికీ తెలిసిందే. పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ సామాన్య కార్యకర్తలతో కూడా కలసిమెలసి ఉండే స్వభావం ఆయనది. 2014లో నిడదవోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కొద్దిరోజుల ముందే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పాటు అప్పటి టీడీపీ గాలిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 12ఏళ్లుగా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో పార్టీకి వెన్ను దన్నుగా నిలబడ్డారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. పార్టీ శ్రేణులు, ద్వితీయ స్థాయి నేతల ఒత్తిడితో రాజీవ్‌కృష్ణ టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. లోకేశతో మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ ఆయన్ను పార్టీలో చేరాలని చేరడానికి ఆహ్వానించినట్టు సమాచారం. రాజీవ్‌ కృష్ణతో పాటు కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు జడ్పీటీసీలు బొంత వెంకటలక్ష్మి, గారపాటి విజయదుర్గాశ్రీనివాస్‌, కొయ్యా సూరిబాబు, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు గారపాటి కృష్ణ, ధర్మవరం మాజీ సొసైటీ అధ్యక్షుడు ముళ్లపూడి కాశీవిశ్వనాథం, పశివేదల మాజీ ఉప సర్పంచ యలమాటి సత్యనారాయణ, వైసీపీ నేతలు నల్లా కిశోర్‌, చంద్రవరం వైసీపీ నేత బండి అశోక్‌బాబు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన భావన రత్నకుమారి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

తాళ్లపూడి జడ్పీటీసీ పోసిన శ్రీలేఖ జడ్పీ వైస్‌ చైర్‌పర్సనగా వున్నారు. ఆమె పార్టీ మారకపోవచ్చు కానీ పలువురు జడ్పీటీసీలు టీడీపీలో చేరడంతో పాటు ఇటీవల కొందరు జడ్పీటీసీలు చైర్‌పర్సనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన పదవికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది. నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల నుంచి కూడా త్వరలో కొంతమంది రాజీవ్‌కృష్ణకు మద్దతుగా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజకీయంగా పట్టున్న కుటుంబానికి చెందిన నేత కావడం వల్ల రాజీవ్‌కృష్ణ చేరికతో టీడీపీకి బలం మరింత పెరిగినట్టేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 01:30 AM