మందేదీ!
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:09 AM
కొత్త మద్యం పాలసీ.. ప్రైవేటు షాపులు అం దుబాటులోకి వచ్చాక మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.నాణ్యమైన సరుకు గొంతులోకి దిగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త పాలసీ ప్రారంభమైన మూడు వారాలకే బ్రాండ్లు కొరత రావడంతో నొచ్చుకుం టున్నారు.
షాపుల్లో మందు కొరత
బ్రాండ్లు అందక ఇబ్బంది
అవసరత 5 వేల కేసులు
దిగుమతి 2 వేల కేసులు
రేషన్ విధానంలో పంపిణీ
చాలా దుకాణాల్లో నిల్వలు
వ్యాపారుల మతలబు
మందుబాబుల అవస్థలు
అధికారుల తనిఖీల్లేవ్
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కొత్త మద్యం పాలసీ.. ప్రైవేటు షాపులు అం దుబాటులోకి వచ్చాక మందు బాబులు పండగ చేసుకుంటున్నారు.నాణ్యమైన సరుకు గొంతులోకి దిగుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త పాలసీ ప్రారంభమైన మూడు వారాలకే బ్రాండ్లు కొరత రావడంతో నొచ్చుకుం టున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ పిచ్చి బ్రాండ్లకు స్వస్తి పలికిన విషయం తెలి సిందే. ఇప్పుడిప్పుడే మద్యం దుకాణాలకు బ్రాం డ్లు వస్తున్నాయి. రోజుకు ఎంత సరఫరా చెయ్యాలో ఇంకా ఓ అంచనాకు రాకపోవడంతో కొరత వస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాం లోని రంగుసారా స్టాకు 2వేల కేసులు ఉంది. దానిని వదిలించుకొనే ఉద్దేశంతో కొరత సృష్టిస్తు న్నారా? అనే అనుమానాలున్నాయి. ఏదేమైనా మందుబాబులు ఆనందపడే లోపుగానే కొరత రావడంతో ఇబ్బంది పడుతున్నారు.
రేషన్ విధానం
గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విచ్చలవిడిగా నాసిరకం మద్యా న్ని ఏరులై పారించారు. దీంతో ఐదేళ్ల పాటు నాసిరకం మద్యాన్ని మందుబాబులు గొంతులో పోసుకోక తప్పలేదు. ఎన్నికల హామీలో చంద్ర బాబు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభు త్వం కొలువుదీరిన తర్వాత బ్రాండ్లను అందు బాటులోకి తెచ్చారు. ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎంసీ, సియా గ్రమ్స్ వంటి అంతర్జాతీయ కంపెనీల బ్రాండ్ల సరఫరా మొదలైంది. ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. వ్యాపారస్తుల ఇండెంట్ ప్రకారం ఆయా కంపెనీలు సరఫరా చేయలేకపోతున్నాయి. వైసీపీ హయాంలోని ప్రభుత్వ దుకాణాల వల్ల కేవలం వాళ్ల బ్రాండ్లనే మార్కెట్ చేశారు. ఇప్పుడు ప్రైవేటు దుకాణాలు కావడంతో వ్యాపా రస్తులు తమకు ఎక్కువగా విక్రయాలు జరిగే బ్రాండ్లకు ఆర్డర్ చేస్తున్నారు. పైగా ప్రైవేటు దుకాణాలకు ఎంత కావాలంటే అంత సరఫరా చేయాల్సి ఉంటుంది. దీంతో వీళ్లు ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. ఈ కారణంగా కూడా కొరత ఏర్పడుతోంది. రేషన్ విధానంలో డిపోల నుంచి పంపిణీ చేస్తున్నారు.దీంతో గత ప్రభుత్వంలో సరఫరా చేయబడి నిల్వ ఉన్న బూమ్,బీరా వంటి వాటిని క్రమంగా వదిలించు కుంటున్నారు.షాపుల్లో మళ్లీ అవి కనబడుతుండ డంతో మందుబాబుల్లో అసహనం కనబడుతోం ది.కొత్త మద్యం పాలసీ షోకు అప్పుడే అయి పోయిందా అంటూ పెదవి విరుస్తున్నారు.
ఆదివారం టెన్షన్
వైసీపీ ప్రభుత్వంలో రూ.150 వెచ్చించినా నాసిరకమైన రంగు సారా తాగాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం రూ.99కే నాణ్యమైన చీఫ్ లిక్కర్ తేవడంతో దానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రోజుకు రెండు మూడు లోడ్లు వచ్చి నా సరిపడని పరిస్థితి ఉంది. ఇప్పుడు రోజుకు ఒక లారీ మాత్రమే వస్తోంది. లారీ సైజును బట్టి 1000 నుంచి 1600 కేసులు వస్తున్నాయి. దీంతో పంపిణీపై అధికారులు తల పట్టుకుంటు న్నారు.రాజమహేంద్రవరం ఏపీఎస్‌బీసీఎల్ డిపో పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు కలిపి 150 వరకూ ఉన్నాయి. లారీ లోడు వచ్చిన వెంటనే దుకాణానికి సరాసరిన 8 కేసుల లెక్కన ఇస్తుం టే ఉఫ్‌మని అయిపోతున్నాయి. మళ్లీ లోడు వచ్చే వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉం ది.ఎంసీ, ఐబీ, నాకవుట్, కేఎఫ్ వంటి ఎక్కువగా విక్రయాలు జరిగే ఓ ఏడెనిమిది బ్రాండ్ల సర ఫరా కూడా తగ్గింది. రోజుకు 5 వేల కేసుల అవసరత ఉంటే 2 వేల కేసుల వరకూ మాత్ర మే వస్తున్నాయి. ఆదివారం డిపోలకు సెలవు కావడంతో దుకాణదారులు శని, ఆదివారాలకు కలిపి శనివారం కొనుగోలు చేస్తారు. దీంతో శనివారం పంపకాలు చేయడానికి అధికారులకు ఇబ్బంది తప్పలేదు. ఆదివారం అమ్మకాలు ఎక్కు వగా ఉండడంతో వ్యాపారస్తులు అందరూ ఆ రోజుపై ఫోకస్ చేస్తుంటారు. ప్రస్తుతానికి రాజ మహేంద్రవరం డిపో నుంచి రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ సరుకు వెళుతో ంది. అయితే దీనిలో చాలా మటుకు వ్యాపారస్తులు నిల్వ చేస్తున్నారు.అటు సరఫరా తగ్గడం, ఇటు వ్యాపారస్తులు ఇబ్బడిముబ్బడిగా సరుకు నిల్వ చేసుకోవడంతో.. జనాదరణ కలిగిన బ్రాం డ్లు కొన్ని షాపుల్లోనే అందుబాటులో ఉంటే అనధి కారికంగా ధర పెంచేస్తారని మందు బాబులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్టు వదిలేయడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా చేస్తున్నట్టు సమాచారం.
Updated Date - Nov 11 , 2024 | 01:09 AM