రొమ్ము కేన్సర్‌పై అవగాహన అవసరం
ABN, Publish Date - Oct 21 , 2024 | 12:49 AM
రొమ్ము కేన్సర్‌పై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కం దుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జీఎస్‌ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పింక్ 5కే రన్ నిర్వహించారు.
మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యేలు వాసు, బత్తుల
రాజమహేంద్రవరంలో పింక్ 5కే రన్
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రొమ్ము కేన్సర్‌పై మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కం దుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ అన్నారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జీఎస్‌ఎల్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పింక్ 5కే రన్ నిర్వహించారు. ఆదివారం స్థానిక పుష్కరాల రేవు వద్ద ఈ రన్ ప్రారంభ కార్యక్రమానికి మం త్రి దుర్గేష్,ఓఎన్‌జీసీ రాజమహేంద్రవరం ఎస్సెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంతను దాస్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, బత్తుల విచ్చేశారు. ఈ రన్ పుష్కరఘాట్ వద్ద నుంచి ప్రారంభమై గోదావరి బండ్, స్టేడియం రోడ్డు, జాంపేట, కోటగుమ్మం మీదుగా తిరిగి పుష్కరాల రేవు వద్దకు చేరుకుంది. ఈ రన్‌లో సుమారు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన చెల్లుబోయిన వెంకటప్రదీప్, కిలపర్తి భాస్కర్, ముదిలి శరత్ చంద్రప్రసాద్‌కు నగదు బహుమతులను అందజేశారు. విజేతలు ముగ్గురూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులే. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మూడు దశాబ్ధాల జీఎస్‌ఎల్ కేన్సర్ హాస్పిటల్ ప్రస్థా నాన్ని ప్రస్తావించి ప్రజలకు డాక్టర్ గన్ని భాస్కరరావు, ఆయన బృందం అందిస్తున్న సేవలను ప్ర శంసించారు. ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ కొన్నే ళ్లుగా రొమ్ము కేన్సర్ కేసులు ఎక్కువవుతు న్నాయ ని వాటిపై అవగాహన కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గన్ని భాస్కరరావు మాట్లాడుతూ కేన్సర్‌ను ముం దే గుర్తిస్తే అంత సురక్షితంగా కోలుకునే అవకా శం వుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేత గన్ని కృష్ణ, జీఎస్‌ఎల్ కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్, సర్జికల్ ఆంకాలజీస్ట్ డాక్టర్ తరుణ్ గోగినేతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, జీఎస్‌ఎల్ విద్యాసంస్థల, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 12:49 AM