బురదపై కలవరం
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:02 AM
బురద కాలువ.. ఈపేరు వినగానే ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ తెగి పంట లను నాశనం చేస్తుందోనని కలవరపాటుకు గురవుతున్నారు.
కాలువ గట్టు చాలా చోట్ల బలహీనం
ఐదారేళ్లుగా పూడికతీతలు శూన్యం
గోకవరం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బురద కాలువ.. ఈపేరు వినగానే ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ తెగి పంట లను నాశనం చేస్తుందోనని కలవరపాటుకు గురవుతున్నారు. సుమారు 24 కిలోమీటర్లు పొడ వు గల ఈ కాలువను అభి వృద్ధి చేయాలనే విషయాన్నే గత పాలకులు మర్చిపోయారు. ఐదారేళ్ల క్రితం కాలువలో పనులు చేసినట్టు అధికారులు చెప్పుకొస్తున్నారే తప్ప ఆ సంగతి ఆయకట్టు రైతులకు మాత్రం తెలియదు. ప్రస్తుతం కాలువ అంతా పూడికతో నిండిపోయింది. కాలువ గట్టు చాలా చోట్ల బల హీనంగా మా రిం ది. ఎగువ ప్రాం తంలో ఓ మాదిరి వర్షం కురిస్తే చాలు బురద కాలువ ఆయకట్టు రైతులకు కంటిమీద కునుకు ఉండదు. బలహీ నంగా ఉన్న కాలువ గట్టు ఎక్కడ తెగిపోతుం దనే భయం రైతులను వెంటాడుతోంది. ఒక్క గోకవరం మండల పరిధిలోనే ఈ కాలువ 18 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. సుమారు 7వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. మిగిలినది కోరుకొండ మండలంలో కలుస్తుంది. కాలువ మొత్తాన్ని మరింత లోతు చేయడంతో పాటు, గట్టును పటిష్ట పర్చాలి, అందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టవలసి ఉంది. అక్కడక్కడా కొత్త బ్రిడ్జిలను కూడా నిర్మించాల్సి ఉందని రైతులు సూచిస్తున్నారు.
Updated Date - Oct 20 , 2024 | 01:02 AM