ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bv Raghavulu: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో జతకడతాం

ABN, Publish Date - Jan 10 , 2024 | 05:08 PM

జాతీయ స్థాయిలో బీజేపీ ( BJP ) వ్యతిరేక పార్టీలతో జతకడతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ( Bv Raghavulu ) తెలిపారు. బుధవారం నాడు ఏలూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కటానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని రాఘవులు మండిపడ్డారు.

ఏలూరు జిల్లా: జాతీయ స్థాయిలో బీజేపీ ( BJP ) వ్యతిరేక పార్టీలతో జతకడతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ( Bv Raghavulu ) తెలిపారు. బుధవారం నాడు ఏలూరులో రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మీడియా గొంతు నొక్కటానికి కొత్త చట్టం తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఏపీలో సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగులను ఎస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగాలు నుంచి తొలగించిన ఏ ప్రభుత్వం నిలబడలేదన్నారు. వైసీపీ అంగన్వాడీల ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే అధికారాన్ని పళ్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇవ్వాల్సి వస్తుందన్నారు. ఏపీలో బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలతో మేము జతకట్టామని తెలిపారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేస్తోందని రాఘవులు స్పష్టం చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 05:08 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising