ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెడీతాలింఖానా సన్నాహాక ప్రదర్శన

ABN, Publish Date - Oct 10 , 2024 | 12:24 AM

అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 169వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహాక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న విన్యాసాలు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 9: అమలాపురం మహిపాలవీధిలోని శ్రీఅబ్బిరెడ్డి రామదాసు చెడీ తాలింఖానా 169వ వార్షికోత్సవ సన్నాహాక ప్రదర్శన బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించారు. చెడీ తాలింఖానా గురువు అబ్బిరెడ్డి మల్లేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సన్నాహాక ప్రదర్శనలో అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. కర్రసాము, కత్తిసాము, బంతుల తాళ్లు, లేడి కొమ్ములు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అబ్బిరెడ్డి రామదాసు, అబ్బిరెడ్డి నరసింహారావు, మూడో తరానికి చెందిన అబ్బిరెడ్డి రామదాసు వారసత్వ సంపదగా చెడీ తాలింఖానా విద్యను దసరా ఉత్సవాల్లో ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాలుగో తరం వారసత్వంగా వీరవిద్యను ఈ నెల 12న ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

Updated Date - Oct 10 , 2024 | 12:24 AM