ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెకుముకి సైన్స్‌ సంబరాలు

ABN, Publish Date - Oct 28 , 2024 | 01:19 AM

గొల్లప్రోలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మాధురి విద్యాలయలో ఆదివారం చెకుముకి జిల్లా స్థాయి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. జాతీయ పతా కం, జేవీవీ సైన్స్‌ పతాకాలను మాధురి విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్యనాయుడు, జనవిజ్ఞాన వే

మాట్లాడుతున్న జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

గొల్లప్రోలు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞానవేదిక కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గొల్లప్రోలు మాధురి విద్యాలయలో ఆదివారం చెకుముకి జిల్లా స్థాయి సైన్స్‌ సంబరాలు నిర్వహించారు. జాతీయ పతా కం, జేవీవీ సైన్స్‌ పతాకాలను మాధురి విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్యనాయుడు, జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు వి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు నుంచి విద్యార్థులకు టెస్ట్‌, ప్రాక్టికల్‌ రౌండ్‌, ర్యాపిడ్‌ రౌండ్‌, మ్యాప్‌ పాయింటింగ్‌, ఆడియో, వీడియో విజువల్‌ రౌండ్స్‌లో పోటీలు జరిగాయి. జిల్లాస్థాయిలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో తుని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూలు, ప్రవేటు పాఠశాలల విభాగంలో కాకినాడ గంగరాజునగర్‌ ఆదిత్య స్కూలు ప్రథమ స్థానం లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాకినాడ ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ వరప్రసాద్‌, జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్‌ ప్రసాద్‌, సత్య స్కాన్‌ డైరెక్టరు కాదా వెంకటరమణ, సమతా జిల్లా కన్వీనర్‌ చల్లా ఉమా రాజ మంగతాయారు, జిల్లా చెకుముకి కన్వీనర్‌ ప్రభాకరవర్మ ఉన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 01:19 AM