సిట్టింగ్ రెడీ!
ABN, Publish Date - Oct 20 , 2024 | 01:30 AM
ఇంకా పూర్తిగా మొదలు కాకుండానే మద్యం వ్యాపారులు కొందరు ఉల్లంఘనలు మొదలుపెట్టేశారు.
అప్పుడే ఉల్లంఘనలు
పర్మిట్ రూంలు ఏర్పాటు
హైవేల పక్కనా షాపులు
రాజమహేంద్రవరం, అక్టోబరు 19 (ఆంధ్ర జ్యోతి): ఇంకా పూర్తిగా మొదలు కాకుండానే మద్యం వ్యాపారులు కొందరు ఉల్లంఘనలు మొదలుపెట్టేశారు. అటు అధికారులు లైసె న్సుల జారీ ప్రక్రియ హడావుడిలో ఉంటే.. ఇటు సందెట్లో సడేమియాగా ఇష్టానుసారం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటి ఏర్పాటు ఇంకా జరుగుతోంది. అయితే.. ఇప్పటికే నిబం ధనల బేఖాతరు కనిపిస్తోంది.
ఫ ఈ నెల 22 వరకూ..
ఈనెల 14న కొత్త మద్యం షాపులు కేటా యించారు. ఈనెల 22 వరకూ ప్రొవిజనల్ లైసెన్సు ఇచ్చారు. తర్వాత రెండేళ్ల గడువుతో అనుమతులు ఇస్తారు. ఈలోపు దీపావళి బాణసంచా మాదిరిగా ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. జిల్లాలో 125 మద్యం షాపులకుగాను ఇప్పటికి 120 షాపులు తెరి చారు. కొన్నిచోట్ల కంటెయినర్లలో వ్యాపారం మొదలుపెట్టారు. 22వ తేదీ తర్వాత ఎక్కడ షాపు పెడితే అక్కడే రెండేళ్లు ఉండాలి. ఒక వేళ ప్రదేశం మార్పు చేయాలంటే ప్రత్యేక పరిస్థి తులను పరిగణనలోకి తీసుకొని ఎక్సైజ్ కమిషన ర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల ఈ వారం రోజుల అమ్మకాలు కోల్పోతామనే ఉద్దేశం తో తాత్కాలికంగా దుకాణ ఏర్పాట్లు చేసుకున్నా రు. అద్దె షాపుల కోసం వెతుకులాడుతున్నారు.
ఫ ఎక్కడికక్కడ సిట్టింగ్‌లు
దుకాణాలు ఏర్పాటుచేసి పట్టుమని వారం రోజులు కాకుండానే నిబంధనలకు నీళ్లొదిలేశారు. ఇకపై పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చకు తెర తీశారు. వాస్తవానికి మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు మాత్రమే చేయాలి. పర్మిట్ రూమ్‌లకు అనుమతులు లేవు. కానీ ఇప్పటికే మద్యం షాపులు పెట్టిన వాళ్లు కొందరు సిట్టింగ్ లు ఏర్పాటు చేసేశారు. పెద్ద ప్రాంగణాలు ఉండే షాపులను అద్దెకు తీసుకొని అక్కడే మందుకొట్టే వెసులుబాటు అనధికారికంగా కల్పించారు. అనధి కార పనులకు అనువుగా ఉండడానికి గతంలో ఉన్న ప్రదేశాలను కూడా కొందరు లీజుకు తీసు కున్నారు. బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి పెద్ద ప్రదేశం ఉంది. చుట్టూ రేకులతో గోడ కట్టారు. లోపల మద్యం దుకాణం పక్కన సిట్టింగ్ ఏర్పాటుచేశారు. అది కనబడ కుండా చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ కట్టారు. అలాగే కంటెయినర్లలో ఏర్పాటుచేసిన వాళ్లు కూడా వాటి కి వెనుక ఉన్న ప్రదేశంలో సిట్టింగ్ ఇచ్చేసుకు న్నారు. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్న షాపులు కొన్ని ఖాళీగా ఉన్నాయి. అయితే వాటికి సిట్టింగ్ ఏర్పాటు చేసుకొనే అవకాశం లేకపోవడంతో అద్దెకు తీసుకోవడానికి ప్రస్తుత వ్యాపారులు వెనుకాడుతున్నారు. అద్దె ఎక్కువైనా షాపుకంటే ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉన్న చోటునే ఎంచుకుంటున్నారు. లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్‌కి వెళ్లే మార్గంలో పెద్ద ఖాళీ ప్రదే శంలో కంటెయినర్ మందుకొట్టు పెట్టారు. ఇక్కడ కూడా అక్కడే తాగే అవకాశం ఇచ్చేసుకున్నారు. ఈ షాపునకు రోడ్డుకు అవతవైపు పెద్ద చర్చి ఉం ది. పక్కన 100 మీటర్ల లోపుగానే ఆస్పత్రి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మద్యం షాపుల నియమా వళి-2024లోని 24వ నిబంధన ప్రకారం గుడికి, బడికి, 30 పడకల పైబడిన ఆస్పత్రులకు 100 మీటర్లలోపు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఉండకూడదు. 20వేలలోపు జనాభా ఉన్న గ్రామాల విషయంలో దూరాన్ని 220మీటర్లుగా పరిగణిస్తారు. హైవేల కు పక్కన కూడా మద్యం దుకాణాలు వెలుస్తు న్నాయి. దివాన్‌చెరువు, రాజానగరంలో ఇప్పటికే ఏర్పాటుచేశారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో హైవేల విషయంలో వెసులుబాటు ఉంది. దానిని చూపించి కార్పొరేషన్ పరిధి అవతల కూడా మద్యం దుకాణాలను హైవేల పక్కనే పెట్టేస్తున్నా రు. 22వ తేదీ వరకూ వెసులుబాటు ఉండడంతో ఎక్కడ పడితే అక్కడ షాపులను తెరిచారు. ఈ నెల 22 తర్వాత అధికారులు షాపులను తనిఖీ చేసి నిబంధనలు పాటిస్తేనే రెండేళ్లకు లైసెన్సు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసీచూడ నట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజు అధికారులు 23 నుంచి ఎంతవరకూ నిబంధనలకు లోబడి విధు లు నిర్వహిస్తారో వేచి చూడాల్సి ఉంది.
కట్టడి చేయకపోతే..
మొక్కై వంగనిది.. మానై వంగునా!? అనేది నానుడి. మద్యం షాపుల విషయంలో కూడా ముందుగానే వ్యాపారస్తులను నిబంధనల పాటిం పు వైపు మళ్లించకపోతే తర్వాత అధికారులకు తిప్పలు తప్పకపోవచ్చు. ఇప్పటికే పలు ఉల్లంఘ నలు యథేచ్చగా కొనసాగుతున్నా అటువైపు యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదు. అయితే.. షాపుల యాజమాన్యంలో కూటమి.. ముఖ్యంగా టీడీపీ, జనసేన నాయకులు భాగస్వాములుగా ఉండడంతో అధికారుల్లో జంకుడు మొదలైందనే చర్చ నడుస్తోంది. ఇక బెల్టు షాపుల ఏర్పాటుకూ మంతనాలు నడుస్తుండడం గమనార్హం.
Updated Date - Oct 20 , 2024 | 01:30 AM