ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అండగా ఉంటా..ఆదుకుంటా..

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:08 AM

‘ఏలేరు వరద బాధితులకు అండగా ఉంటా. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తా.తక్షణం దుస్తులు పంపిణీ చేయిస్తా. పంటలు నష్టపోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.25వేల సాయం, ఎరువులు, పొటాషియం అందిస్తా. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇళ్లు కట్టిస్తా ను’ అని సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు.

నిత్యావసర సరుకులు అందిస్తున్న చంద్రబాబు

బాధితులందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటన

రాజుపాలెం గ్రామానికి ఎక్స్‌కవేటర్‌పై వెళ్లి పలకరించిన సీఎం

ముంపులో చిక్కుకున్న పెంకుటిళ్లు లోపలకు వెళ్లి బాధితులకు భరోసా

ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు, దుస్తులు ఇవ్వనున్నట్టు వెల్లడి

కుళ్లిన వరి కంకులను చంద్రబాబుకు చూపించి రైతుల ఆవేదన

ఏలేరు ఆధునికీకరణ పూర్తి చేసే బాధ్యత ఎన్డీయేదేనని ప్రకటన

వడ్లమూరులో రైతు ఇచ్చిన కొబ్బరి బొండం తాగిన చంద్రబాబు

దివిలి వద్ద విద్యార్థులతో మాటామంతీ.. రాజుపాలెం వద్ద రైతులతో..

సామర్లకోటలో దిగి.. అక్కడ నుంచి వెళ్లి ఏలేరు కాలువ పరిశీలన

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/పెద్దాపురం/కిర్లంపూడి/సామర్లకోట, సెప్టెంబరు11: ‘ఏలేరు వరద బాధితులకు అండగా ఉంటా. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తా.తక్షణం దుస్తులు పంపిణీ చేయిస్తా. పంటలు నష్టపోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.25వేల సాయం, ఎరువులు, పొటాషియం అందిస్తా. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇళ్లు కట్టిస్తా ను’ అని సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రతిఒక్కరికీ సాధ్యమైనంత వేగంగా సాయం పంపిణీ చేయిస్తామని వివరించారు. ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించారు. మధ్యాహ్నం 1.53 గం టలకు సామర్లకోట జూనియర్‌ కాలేజీ మైదానంలో హెలీకాఫ్టర్‌లో దిగారు. అక్కడ నేతలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం నేరుగా కిర్లంపూడి మం డలం రాజుపాలెం వరద ముంపు గ్రామం పరిశీలనకు వెళ్లారు. మార్గమధ్యలో బస్సు దిగి పెద్దాపురం మండలం వడ్లమూరు బ్రిడ్జిపై నుంచి ఏలేరు వరదను పరిశీలించారు. వరద తమ పొలాలను ఏవిధంగా ముంచేసిందో కొందరు రైతు లు చంద్రబాబుకు వివరించారు. అనంతరం దివిలి సెంటర్‌లో బీఎస్సార్‌ కాలేజీ విద్యార్థులు సీఎం కోసం వేచి చూడగా వీరిని చూసి సీఎం బస్సు దిగారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు రూ.లక్ష చెక్కును ఏలేరు వరద బాధితుల సహాయం కోసం అందించారు. అక్కడి నుంచి సీఎం రాజుపాలెం గ్రామానికి చేరుకున్నారు. అప్పటికీ గ్రామంలో ఛాతివరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరుకు గండిపడడంతో పూర్తిగా వరద ముంపు లో చిక్కుకున్న గ్రామానికి సీఎం సాహసం చేసి ఎక్స్‌కవేటర్‌పైకి ఎక్కారు. పక్క నే ఏలేరు వరద ఉధృతి కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఎన్ని ఎకరాల మేర పంటలు మునిగాయో అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ఆ తర్వాత వరద ముంపులో చిక్కుకున్న ఇళ్ల వద్దకు మోకాల్లోతు నీటి లోకి దిగి వెళ్లారు. తొలుత కాకాడ వసంతరావు ఇంటికి వెళ్లారు. ముంపుతో ఏ విధంగా నష్టపోయామో బాధితులు సీఎంకు వివరించగా పక్కనే ఉన్న కలెక్ట ర్‌ను పిలిచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. ఆ తర్వాత వినకోటి కోటేశ్వరరావు, గణేశుల బాబురావు, చక్రవర్తుల సత్యన్నాయరణమ్మ, కేలంగి వెం కటలక్ష్మి, స్థానిక ఎస్సీ పేటకు చెందిన వికలాంగుడు దెయ్యాల నాగు తదితర కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు. వరదకు ఇళ్లు ముంపుతో నష్టపోయిన తీరును చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. భూపాలపట్నంలో ఏలేరు కాలువలో పడి వ్యక్తి మృతిచెందడంతో ఆ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి సీఎం రాజుపాలెం పంచాయతీకి చేరుకుని బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు. కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లోని వరద ముంపు ప్రాంతాల ను సందర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు సామర్లకోట చేరుకుని జిల్లా ఉన్నతాధికారులతోను, ప్రజాప్రతినిధులతోను సమీక్షిస్తారని ముందుగా అధికా రులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా బుధవారం మధ్యాహ్నం సామర్ల కోట టీటీడీసీ ఆవరణలో వరద ప్రాంతాల ఛాయా చిత్రప్రదర్శన ఏర్పాటు చేశా రు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో బాధిత రైతులతో మమేకమైన సీఎం అక్కడ అధిక సమయం ఉండడంతో అప్పటికప్పుడు సామర్లకోటలోని కార్యక్ర మం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ సత్యనారా యణమూర్తిలు హెలీపాడ్‌ వద్దకు సీఎంకు వీడ్కోలు పలికేందుకు తరలివెళ్లారు.

ఏలేరు ఆధునికీకరణ బాధ్యత ఎన్డీయేదే..

ఏలేరు కాలువ ఆధునికీకరణ బాధ్యత పూర్తి బాధ్యత ఎన్డీయేదే అని చంద్ర బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు కష్టాలు వచ్చా యన్నారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఒకేసారి 47వేల క్యూసెక్కుల వరదనీరు వ చ్చిందని, కిందకు వదలకపోతే ప్రాజెక్టుకు ప్రమాదం కావడంతో వరద వదలా రన్నారు. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయన్నారు. వరదల కారణంగా జిల్లాలో 65 వేల ఎకరాలు పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. ఏలేరు వరద పై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారన్నారు. వరద ఏలేరు కాలువల్లో ఎలా ప్రవహిస్తోంది. గండ్లు ఎక్కడ పడే అవకాశం ఉందనే దానిపై అధికారులు డ్రోన్ల ద్వారా చూసి కలెక్టర్‌ సమయస్ఫూర్తితో వ్య వహరించారన్నారు. కాగా సీఎం ప్రయాణించిన బస్సులో ఎమ్మెల్యేలు ఎక్కారు. కిర్లంపూడిలో వరద ప్రభావం గురించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చంద్రబా బుకు వివరించారు. ఏలేరు రిజర్వాయరుకు వస్తోన్న ఇన్‌ఫ్లో, కాలువలకు గండ్ల పరిస్థితిని ఎమ్మెల్యే సత్యప్రభ వివరించారు. పిఠాపురం మునిగిన తీరును ఫోటో లతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ చంద్రబాబుకు వివరించారు. బాబు వెంట ఎమ్మెల్యేలు యనమల దివ్య, పంతం నానాజీ, దాట్ల బుచ్చిరాజు, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, చిక్కాల రామచంద్ర రావు, జ్యోతుల నవీన్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, జగ్గంపేట జనసేన ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌, మాజీ ఎంపీటీసీ గొడే దొరబాబు, సర్పంచ్‌ వీరంరెడ్డి కాశీబాబు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 08:12 AM

Advertising
Advertising