పర్యాటకంగా కడియం అభివృద్ధి : కలెక్టర్
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:10 AM
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిదులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడంపై సమన్వయ శాఖల అఽధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
పర్యాటకంగా కడియం అభివృద్ధి : కలెక్టర్
కడియం, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిదులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడంపై సమన్వయ శాఖల అఽధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో పర్యాటక, ఉద్యా నవన, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కడియం నర్సరీలను వివిధ రకాల అంశాలతో కూడిన రీతిలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభి వృద్ధి చేయాల్సి ఉందన్నారు. బోటింగ్, స్టాల్స్, జిప్ లాగ్, అడ్వంచర్ స్పోర్ట్స్ తదితర అంశాల సమ్మేళనంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. టూరిజం అభివృద్ధి వల్ల ఈ ప్రాంతానికి మంచి గుర్తింపుతోపాటు ఇక్కడి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. స్టాల్స్ ప్రతిపాదన కోసం లే అవుట్ సిద్ధం చేసి, కేటాయింపులపై ప్రణాళిక అందజేయాలని ఆదేశించారు. సౌందర్య వాస్తుశిల్పి ఎక్కువమంది సందర్శించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కడియం ప్రాంతాన్ని శానిటేషన్‌పరంగా చక్కని నిర్వహణ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ ఏ దుర్గేష్, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, పర్యాటకశాఖ మేనేజర్ సీహెచ్ పవన్‌కుమార్, డిప్యూటీ ఈఈ (పర్యాటక) జీ ఎస్‌వీవీ సత్యనారాయణ, సహాయ మేనేజర్ ఆర్ గంగరాజు, జిల్లా ఉద్యాన అధికారి బి సుజాతకుమారి, కడియం తహశీల్దారు కే పోశిబాబు, ఎంపీడీవో కే రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 02:10 AM