కంటితుడుపు నివేదికలు వద్దు
ABN, Publish Date - Nov 13 , 2024 | 01:08 AM
ఇరిగేషన్ అధికారులపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ అంటే కేవలం సాగునీటి కోసం కాదు
అధికారుల అసంపూర్తి నివేదికపై కలెక్టర్ ఆగ్రహం
వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి
రాజమహేంద్రవరం,నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఇరిగేషన్ అధికారులపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సాగునీటి సలహామండలి సమావే శానికి అరకొర వివరాలతో వచ్చిన ఇరిగేషన్ అధికారులకు ఆమె క్లాస్ తీసుకున్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం సా యంత్రం రబీ సీజన్ ఏర్పాట్లకు నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమా వేశాన్ని అసంపూర్తిగా వాయిదా వేశారు. డిసెంబరు 1 నుంచి రబీ సీజన్ మొదలు పెట్టడానికి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.శ్రీని వాసరావు,ఈఈ కాశీ విశ్వేశ్వ రరావు, పలు వురు డీఈఈలు ఒక నివేదికతో హాజర య్యా రు.ఇరిగేషన్ అధికారులు తెచ్చిన నోట్ చది విన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో డెల్టాల పరిధిలో ఎన్ని మండలాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో ఎన్ని హెక్టార్ల ఆయకట్టు ఉంది.అక్కడ నీరు ఎంత అవస రం.ప్రస్తుతం గోదావరిలో నీరెంత. రబీకి ఎంత అవసరం.తక్కువ వస్తే ఏమి చేయా లని అనే ప్రశ్నలు సంధించారు. నీరు ఉందని చెబుతారు. ప్రతి ఏటా రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు.తమ పొలాలు ఎం డిపోయాయని ఎందుకు చెబుతుంటారు. మరి ఈ నివేదికలో ఇవేమీ ఎం దుకు ఉండ వని ఆమె నిలదీశారు. గోదావరిలో నీరు సముద్రంలోకి పోతుంటుంది. ఎత్తి పోతల పథకాలకు, పరిశ్రమలకు సరిపడా నీరివ్వొ చ్చుకదా, గోకవరం మండలంలో భూ గర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆందోళన చెందు తున్నారు.గోదావరి ప్రక్కనే ఉన్న రాజమ హేంద్రవరానికి పూర్తిగా మంచినీళ్లివ్వలేని పరిస్థితి ఉంది. కొవ్వూరు, నిడదవోలు వంటి ప్రాంతాలకు ఇంకా బోరు నీరే ఆధారం. అక్కడకు మంచినీళ్లు ఇవ్వడానికి ఎం దుకు ఆలోచించరని అన్నారు. ఇక కంటితుడుపు నివేదికలు వద్దని క్లాస్ తీసుకున్నారు. తూర్పుడెల్టా ప్రాంతంలోని కడియం, బిక్క వోలు, అనపర్తి మండలాలు, పశ్చిమ డెల్టా పరిధిలోని కొవ్వూరు కొంతభాగం, నిడదవోలు, పెరవలి మండలాల్లో ఎంత ఆయకట్టు ఉంది. గతేడాది ఏ సమస్య వచ్చింది. దానిని ఎలా అధిగమించాలని,మొత్తం నీరు ఎంత అవస రం అనే నివే దికలు సిద్ధం చేయాలన్నారు. పశ్చిమ డెల్టా ప్రాంత డీఈఈ గైర్హా జర్‌పై మండిపడ్డారు. రానున్న సమావేశానికి సమ న్వయ శాఖల అధికారులతో పాటు సం బం ధిత ఇరిగేషన్ అఽధికారులు పూర్తి నివే దికతో హాజరుకావాలన్నారు.సాగునీటిపై మండల వ్యవసాయ అఽధికారులు నివేదిక తయారు చేయాలన్నారు. వ్యవసాయ అను బంధ శాఖ లు,నీటి సరఫరా, మునిసిపల్ ,ఆర్‌డబ్ల్యూఎస్ అఽధికారులు,మంచినీటి అవసరాలు, పరిశ్ర మల నీటి అవసరాలతో కూడిన నివేదిక అం దించాలన్నారు. ఎర్రకాలువ, కొవ్వాడ, చింతల పూడి, తొర్రిగడ్డ ప్రాజెక్టుల ఏఈలు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని సీజన్‌వారీగా సాగు విస్తీర్ణం, సాగునీటి అందించడంలో సమస్య లపై నివేదిక అందించాలన్నారు.ఇరిగేషన్ సమావేశానికి కొంతమంది అధికారులే హాజ రవడం.. ఇరిగేషన్ అధికారులు తయారు చేసి నోట్‌లో సరైన వివ రాలు లేకపోవ డంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాన్ని వాయిదా వేసి.. పూర్తి వివరా లతో మరోసారి రావాలని పంపించేశారు. సమావేశంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత, జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు, ఇరిగేషన్ ఈఈ కాశి విశ్వేశ్వరావు, సీపీఎ ఎల్. అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 01:08 AM