ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అవినీతి గబ్బిలాలు

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:33 AM

రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి వేలాడుతున్న గ్రామ స్థాయి అవినీతి గబ్బిలాలు ఏకంగా మండల స్థాయి అధికారిని సైతం శాసించే స్థాయికి ఎదిగిపోయాయి. కలెక్టరేట్‌నీ గుప్పిట్లో పెట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకతవకలను బయటకు తీయాలని ప్రయత్నించే అధికారులను రాత్రికి రాత్రే బదిలీ చేయిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు.

అధికారులపై ‘కింది స్థాయి వారిదే’ పైచేయి

తీవ్ర ఆరోపణలున్నా చర్యలు శూన్యం

అవకతవకలపై ఉన్నతాధికారులూ మౌనం

మాటిమాటికీ తహసీల్దార్ల బదిలీ(ల)లు

అక్రమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో వారే బలి

రెవెన్యూ శాఖలో ఏళ్ల తరబడి వేలాడుతున్న గ్రామ స్థాయి అవినీతి గబ్బిలాలు ఏకంగా మండల స్థాయి అధికారిని సైతం శాసించే స్థాయికి ఎదిగిపోయాయి. కలెక్టరేట్‌నీ గుప్పిట్లో పెట్టుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవకతవకలను బయటకు తీయాలని ప్రయత్నించే అధికారులను రాత్రికి రాత్రే బదిలీ చేయిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో అర్థం చేసుకోవచ్చు. అసైన్డ భూముల్లో అవినీతి, మాజీ సైనికుల పేరుతో భూములను స్వాహా చేయడం, ఉద్దేశపూర్వంగా తప్పులు చేసి రైతుల దగ్గర నుంచి డబ్బులు గుంజడం.... ఇలా ఒకటేమిటి అన్నీ అక్రమాలే జరుగుతున్నాయంటూ జనం నుంచి వినిపిస్తున్న ఆరోపణలే. ఈ విషయం ఊరంతా తెలిసినా ఉన్నతాధికారులకు కానరాకపోవడం విస్మయం కలిగించే అంశం. అవినీతితో జేబులు నింపుకునే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఇంటి దొంగలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. విజిలెన్స రంగంలోకి దిగినా అక్రమాలను వెలికి తీయడానికి దీర్ఘకాలం పట్టేలా వుంది. గోకవరం తహసీల్దారు కార్యాలయంలో తారస్థాయికి చేరిన అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం....

గోకవరం (ఆంధ్రజ్యోతి)

గోకవరం తహసీల్దారుగా రావడానికి చాలా మంది జంకుతు న్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు కొనసాగిన అవినీతి తమకు చుట్టుకుం టుందేమో అనే మీమాంసతో కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఇక్కడ తహసీల్దారుగా ఎవరు చార్జి తీసుకున్నా ఆ సంతకాల ఇంకు ఆరక ముందే బదిలీపై వెళ్లాల్సి వస్తోంది. మండలంలోని ఇద్దరు, ముగ్గురు గ్రామస్థాయి అధికారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో చిత్రంగా వారే బలైపోతున్నారు. ఈ అవినీతిపరులపై చర్యలకు సిఫారసు చేసిన అధికారులు చిక్కుల్లో పడుతుండగా వీళ్లు మాత్రం కాలర్‌ ఎగరేసుకుని మరీ మరిన్ని అక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల ముందు నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా నలుగురు, ఐదుగురు తహసీల్దార్లు రోజుల వ్యవధిలో ఎందుకు బదిలీ అయ్యారో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఓ మహిళా తహసీల్దారు చార్జి తీసుకున్నాక... మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెడుతూ సొమ్ములు వసూలు చేస్తున్నారని, ఈ తతంగంలో కార్యాలయానికి కూడా పాత్ర ఉందని ప్రాథమి కంగా అంచనాకు వచ్చారు. వెంటనే తహసీల్దారు కార్యాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరు వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేశారు. మరో ఇద్దరు, ముగ్గురు వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదిక కలెక్టరుకు వెళ్లే కొద్ది గంటల ముందు పైరవీలు జరిగి లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలకు ఉపక్రమించిన ఆ అధికారికి రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులు చేతికి అందాయి. దీంతో మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్యాలయంలోని సీసీ కెమెరాలు మాయమయ్యాయి. దీనికి తోడు పలు అవినీతి ఆరోపణలపై ఆమెకు ముందు వెళ్లిన తహసీల్దారే మళ్లీ ఈ సీట్లోకి వచ్చారు. ఈ తంతులో సదరు గ్రామస్థాయి అధికారులు చక్రం తిప్పినట్టు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఏజెన్సీలోని ఓ వైసీపీ నేత అండదండలతో మహిళా తహసీల్దారు నివేదిక బుట్టదాఖలు చేసి ఆ రెవెన్యూ అధికారులు సస్పెన్షన నుంచి తప్పించుకున్నట్టు ఆరోపణలు లేకపోలేదు. ఆ రెవెన్యూ అవినీతి తిమింగలాల్లో ఒకరు గతంలో సస్పెన్షనకి గురికావడం గమనార్హం. ఇంత జరుగుతున్నా వీళ్లను అంగుళం కూడా కదిలించలేకపోతున్నారనే వాదన ఉంది. ఇప్పటికే వారు మండలంలోనే చక్కగా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో తహసీల్దారును తాజాగా సుమారు వారం క్రితం ఇక్కడి నుంచి ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దారు హవా కొనసాగుతోంది.

అక్రమాలకు అంతే లేదు

కామరాజుపేటలో సీలింగ్‌ భూములకు నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇచ్చిన వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో ఒకరు తతంగం నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. రెండు గ్రామాలకూ బాధ్యత వహించిన (గతంలో) సదరు రెవెన్యూ అధికారి అవినీతిపై రైతులు అనేక ఆరోపణలు చేశారు. భూ సంస్కరణ చట్టం వచ్చిన తర్వాత గంగంపాలెం పంచాయతీ పరిధిలో 16 ఎకరాల భూమిని సదరు భూస్వామి ప్రభుత్వానికి ఇవ్వలేదు. దీనిపై కోర్టులో వ్యాజ్యం నడిచాక ఆ భూమిని సదరు యజమాని ప్రభుత్వానికి ఇచ్చేశారు. కాలక్రమంలో పేదలు వాటిలో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మరో రెవెన్యూ అధికారి ఈ భూముల్లో ఓ ఉన్నత స్ధాయి అధికారి అండదండలతో మతలబు చేసే ప్రయత్నం చేయగా.. ఆ విషయం బయటకు పొక్కి ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయి. దీంతో ఆ రెవెన్యూ అధికారి వెనక్కు తగ్గారు. గుమ్మళ్లదొడ్డిలో కోట్లాది రూపాయలు విలువ చేసే సీలింగ్‌ భూమిని గతంలో కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి ఇటీవల ఓ మాజీ ఆర్మీ ఉద్యోగికి ఇచ్చినట్టు చూపించారు. అతను ఎవరో, ఎక్కడి వారో కూడా వివరాలు తెలియట్లేదని గ్రామస్తులు చెప్తున్నారు. దీంతో చాలా ఏళ్ల నుంచి ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు రోడ్డునపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ భూములను నిరుదపేదలకు కాకుండా రాజకీయ పలుకుబడి కలిగిన వారికు కట్టబెట్టారన్న అపవాదు ఇక్కడ అధికారులకు ఉంది.

గోకవరం తహసీల్దారు కార్యాలయంలో పగలు కన్నా రాత్రి సమయంలోనే అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేంటి బాధ్యతగానే ఉన్నారు కదా అనుకుంటే పప్పులో కాలిసినట్టే! అక్రమ పనులన్నీ ఆ సమయంలోనే పూర్తి చేసేస్తున్నారనే నింద గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులపై బలంగా ఉండేది. రాత్రి పది, పదకొండు గంటలైనా కార్యాలయంలో లైట్ల వెలుగులో వారికి నచ్చిన పనులను నచ్చినట్టు పూర్తి చేసి అవతల వ్యక్తులను సంతృప్తిపరిచే వారనే ప్రచారాన్ని గత అధికారులు మూటకట్టుకున్నారు. ఆ సమయంలో ఎవరైనా వెళ్తే... అధికారులు అర్జెంట్‌ పని చూసుకుంటున్నారని, ఉదయం రావాలని ఆరు బయటే ఓ వ్యక్తిని పెట్టుకొని సమాధానం చెప్పించేవారని అనుభవం ఎదుర్కొన్న పలువురు వ్యక్తులు చెప్పుకొస్తున్నారు. రాత్రివేళ పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఓ రెవెన్యూ అధికారి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన కూడా ఇటీవలి కాలంలో జరిగింది.

కొత్తగా వచ్చిన అధికారులు కూడా అదే ఆచారాన్ని కొనసాగిస్తుండడం గమనార్హం. తాజాగా శనివారం రాత్రి 8 నుంచి 8.30 గంటల మధ్యలో కార్యాలయం నిండా పలువురు రెవెన్యూ అధికారులు బిజీబిజీగా కనిపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు, ముగ్గురు అధికారుల్లో ఒకరు తహసీల్దారు గదిలో ఏవేవో రికార్డులు చేత పట్టుకుని కనిపించడం విశేషం. కార్యాలయం ఆరు బయట అధిక సంఖ్యలో మోటారు సైకిళ్లు పార్కిం గ్‌ చేసి ఉన్నాయి. రాత్రి సమయంలో కూడా అంత అర్జెంటైన పని ఏమిటో అధికారులకే ఎరుక.

Updated Date - Oct 21 , 2024 | 12:33 AM