ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తక్కువ కోట్‌ చేసిన వారికే ఇసుక రీచ్‌ల అనుమతులు

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:46 AM

సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువ ధరలో కోట్‌ చేసిన వారికే ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ చెప్పారు. జిల్లాలోని పన్నెండు ఇసుక రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు, వాహనాల లోడింగ్‌, స్టాకు పాయింట్ల వరకు రవాణా, స్టాకు పాయింట్ల నుంచి వాహనాల్లో ఇసుకను లోడ్‌ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన షీల్డు టెండర్ల టెక్నికల్‌ బిడ్‌లను పూర్తి పారదర్శకతతో ధ్రువీకరించాలని సూచించారు.

అమలాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువ ధరలో కోట్‌ చేసిన వారికే ఇసుక రీచ్‌ల నిర్వహణకు అనుమతులు ఇస్తామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ చెప్పారు. జిల్లాలోని పన్నెండు ఇసుక రీచ్‌ల్లో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలు, వాహనాల లోడింగ్‌, స్టాకు పాయింట్ల వరకు రవాణా, స్టాకు పాయింట్ల నుంచి వాహనాల్లో ఇసుకను లోడ్‌ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన షీల్డు టెండర్ల టెక్నికల్‌ బిడ్‌లను పూర్తి పారదర్శకతతో ధ్రువీకరించాలని సూచించారు. పన్నెండు కంపెనీలు సమర్పించిన ధ్రువపత్రాలు, టర్నోవర్‌, కంపెనీల ప్రామాణికతను ఐదు లీగల్‌ అంశాల అర్హతలను ధ్రువీకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఇసుక టెండర్ల బిడ్‌లు ధ్రువీకరణ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. జిల్లాలోని 12 ఇసుక రీచ్‌లను 2025వ సంవత్సరం మార్చి 14 వరకు అప్పగించేందుకు ఫైనాన్షియల్‌ బిడ్‌లు, సీల్డు టెండర్లను స్వీకరించామన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, గనులు, భూగర్భశాఖ అధికారి ఎల్‌.వంశీధర్‌రెడ్డి, జిల్లా రిజిస్ర్టార్‌ నాలింగేశ్వరరావు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, జిల్లా ఆడిట్‌ అధికారి ఏవీవీ సత్యనారాయణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.శివరామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, జలవనరులశాఖ డీఈ బి.శ్రీనివాసరావు, రియాల్టీ ఇన్‌స్పెక్టర్‌ టి.సుజాత పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:46 AM