ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డెల్టా రూపశిల్పి కాటన్‌ మహాశయుడు

ABN, Publish Date - May 16 , 2024 | 01:18 AM

డెల్టా రూపశిల్పి కాటన్‌ మహాశయుడు అని రైతులు, నర్సరీ రైతులు పేర్కొన్నారు. కాటన్‌ 221వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లాలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు.

కాటన్‌ జయంతి వేడుకల్లో పలు సంఘాల నాయకులు

కడియం, మే 15: డెల్టా రూపశిల్పి కాటన్‌ మహాశయుడు అని రైతులు, నర్సరీ రైతులు పేర్కొన్నారు. కాటన్‌ 221వ జయంతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లాలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు.

ఫ కడియపులంక - సర్‌ ఆర్ధర్‌కాటన్‌ నర్సరీపార్మర్స్‌ అసోసియేషన్‌ కార్యా లయ ప్రాంగణంవద్ద పాలకవర్గ సభ్యులు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పెనుమాక కొండబాబు ఆధ్వర్యంలో కాటన్‌ 221వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సరీరైతులు, నర్సరీసంఘం పాలకవర్గ సభ్యులు, పుల్లా ఆంజనేయులు, పాటంశెట్టి చినమహాలక్ష్మినాయుడు, మార్గాని సత్యనారాయణ, పల్ల సుబ్రహ్మణ్యం, తిరుమలశెట్టి సూర్యభాస్కరావు, తాడాల చక్రవర్తి, బొర్సు వెంకట్రాయుడు, పుల్లా పెదసత్యనారాయణ, తాడాల రవి, గాద నాగేశ్వరరావు, ఘట్టా కృష్ణ, తాడాల బాలమురళీకృష్ణ, జంగా సుబ్బారావు, గరగ నాగేశ్వరరావు, అడ్డగర్ల రమేష్‌, డైరెక్టర్లు పిల్లా శ్రీనివాసు, గాజుల రత్తయ్య, రావిపాటి రామకృష్ణ, కొండేపూడి నాగు, వడ్డమూడి రాజేష్‌, ముద్రగడ జమీ, కొత్తపల్లి నాగశివాజీ, ఆకుల గోపాలకృష్ణ, చెక్కపల్లి పోలరాజు, తాళం నరేష్‌, పెమ్మనబోయిన వీర్రాజు, ఆకుల వెంకన్న, వరగోగుల రుద్రయ్య, పాటంశెట్టి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

ఫకడియం - బ్రాహ్మణరేవు వద్ద ఉన్న సర్‌ ఆర్థర్‌ కాటన్‌ విగ్రహం వద్ద కాటన్‌ జయంతి సందర్భంగా కాటన్‌ విగ్రహానికి రైతులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు, డాక్టర్‌ దేవవరపు నీలకంఠరావు, చిక్కాల శ్రీనివాసరావు, దొడ్డా బుజ్జి, బండారు భాస్కరరావు, కోలా సురేష్‌, పొన్నా ప్రసాద్‌, ఉండమట్ల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మురమండ - బస్టాండ్‌ సమీపంలో ఉన్నకాటన్‌ విగ్రహం వద్ద కాటన్‌ 221వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి వెంకటరామయ్యచౌదరి, పోతుల కృష్ణయ్య, గుణ్ణం కృష్ణమూర్తి, దొంతంశెట్టి శివయ్య, శీని బాస్కరావు, కాకి వెంకటరమణ, యార్లగడ్డ దాసు, కొత్తపల్లి నారాయణస్వామి పాల్గొన్నారు.

మోక్షగుండం మామిడి..

కడియపుసావరం గ్రామానికి చెందిన సప్తగిరి నర్సరీ అధినేత కుప్పాల దుర్గారావు తన నర్సరీలో సరికొత్త మామిడి అభివృద్ధి చేశారు. థాయిలాండ్‌ నుంచి తీసుకువచ్చి దానికి అంట్లు కట్టి ఫలాలు కాయించారు. కాటన్‌ జయంతి సందర్భంగా సత్యదేవా నర్సరీ రైతు, నర్సరీసంఘం మాజీ అధ్యక్షుడు పుల్లా అబ్బులు ఈ మొక్కకు మోక్షగుండం మామిడిగా నామకరణం చేశారు. పలు నీటి ప్రాజెక్టుల అభివృద్ధిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరును ఈ మొక్కకు పెట్టారు.

అపర భగీరధుడు కాటన్‌ దొర

ధవళేశ్వరం, మే15: గోదావరిపై ఆనకట్ట కట్టి నీటిని బీడు భూములు మళ్ళించిన కాటన్‌ దొర అపర భగీరధుడని డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు కొనియాడారు. బుధవారం ఉదయం కాటన్‌స్మృతి వనంలో కాటన్‌ దొర విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

డెల్టా రూపశిల్పి కాటన్‌ దొర

గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి నీటిని కాల్వల ద్వారా మళ్లించి బీడుభూములకు నీరు అందించి సస్యశ్యామలం చే సినన డెల్టా రూపశిల్పి కాటన్‌ దొర నీటి పారుదల శాఖ ఇంజనీర్‌లు ఘనంగా నివాళులర్పించి ఆయన జయంతిని నిర్మించారు. బ్యారేజ్‌ముఖ ద్వారం వద్ద ఉన్న కాటన్‌ దొర విగ్రహానికి డెల్టా సీఈ ఆర్‌. సతీష్‌కుమార్‌, ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ జి.శ్రీనివాసరావు, హెడ్‌ వర్క్స్‌ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు, తూర్పుడెల్టా ఈఈ రామకృష్ణ, డీఈ రమేష్‌, తదితరులు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులు కాటన్‌ను ఆదర్శంగా తీసుకుని పనిచే యాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఇంజనీర్‌లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన కాటన్‌

ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి

అనపర్తి: గోదావరినదిపై ఆనకట్టను నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్‌ఆర్డర్‌ కాటన్‌ చిరస్మరణీయు డని ఎన్డీయే కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నా రు. బుధవారం కాటన్‌ జయంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలోని కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలు వృథాగా పోవడాన్ని గుర్తించి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చే ందుకు ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి అపర భగీరథుడిగా నిలిచారని అన్నారు. గోదావరి ప్రజల గుండెల్లో కాటన్‌ దొర దైవంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తేనెల శ్రీనివాస్‌, చింతా సురేష్‌రెడ్డి, సత్య, గొలుగూరి వీర్రాఘవరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, తది తరులు పాల్గొన్నారు.

కొవ్వూరు, మే 15 : ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి ధాన్యాగారంగా తీర్చిదిద్దిన సర్‌ ఆర్దర్‌ కాటన్‌ భావితరాలకు ఆదర్శప్రాయులని రైస్‌ అండ్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్‌ కొనియాడారు. రైస్‌ అండ్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వూరు పట్టణంలో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక హెవ్‌లాక్‌ వంతెన (పాత రైలు వంతెన) వద్ద ఉన్న ఆర్దర్‌ కాటన్‌ విగ్రహానికి రైస్‌ అండ్‌ కిరాణా మర్చంట్స్‌ నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఎల్‌ఐసీ సెంటర్‌ కాటన్‌ విగ్రహంవద్ద జయంతి వేడులను నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారన్నారు. కార్యక్రమంలో పాకా శ్రీనివాస్‌, తుమ్మలపల్లి నాగరమేష్‌, నాళం శ్రీనివాస్‌, కొత్త ప్రసాద్‌, మద్దుల వీర సోమరాజు, వంకాయల శివరామకృష్ణ పాల్గొన్నారు.

నిడదవోలు: గోదావరి జిల్లాల వాసుల ఆరాధ్య దైవం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మహానీయుడని ఏపీఎన్‌జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.నందిశ్వరుడు అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని నీటిపారుదలశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ విగ్రహానికి ఆయన జయంతిని పురస్క రించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఎన్‌ జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.నందీ శ్వరుడు మాట్లాడుతూ కాటన్‌ మహాశయుడు పరాయి దేశస్తుడైనప్పటికీ గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడని అన్నారు. నేటికీ అందరి హృదయాలలో కాటన్‌ మహాశయుడు సజీవంగా నిలిచే ఉన్నారన్నారు. కార్యక్రమంలో కె.నాగేశ్వరరావు, బి.కిషోర్‌, కె.శ్రీనివాస్‌, ఎమ్‌.శ్రీనివాస్‌, కె.రామసత్యనారాయణ, నీటిపారుదల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఉండ్రాజవరం: మండలంలో సర్‌ ఆర్దర్‌ కాటన్‌ జయంతి సందర్భంగా బుధవారం పలు గ్రామాల్లో నిర్వహించారు. కాటన్‌ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పసలపూడి లాకుల వద్ద సర్‌ ఆర్దర్‌ కాటన్‌ విగ్రహానికి నీటిపారుదలశాఖ లాక్‌ సూపరింటెండెంట్‌ ముప్పిడి విజయకుమార్‌ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. కాల్థరి, వేలివెన్ను, పసలపూడి,ఉండ్రాజవరం, చిలకపాడు గ్రామాల్లో కాటన్‌ విగ్రహాలకు రైతులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - May 16 , 2024 | 01:19 AM

Advertising
Advertising