అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:19 AM
: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయ మని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నేదునూరులో ఇది
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులు
వంద రోజుల పాలనపై కరపత్రాల పంపిణీ
అయినవిల్లి, సెప్టెంబరు 20: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయ మని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం నేదునూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం సర్పంచ్ గుమ్మడి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. 100 రోజుల్లో ప్రభుత్వం ఉమ్మడి మ్యానిఫెస్టోలు తెలిపిన విధంగా పెన్షన్లు రూ.4వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణ అభివృద్ధికి పంచాయతీకి నిధులు, అన్నక్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5లకే భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామన్నారు. ఎంపీ హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలను స్ధానికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాడి వెంకటాచార్య, మండల ప్రత్యేకాధికారి శివశంకరప్రసాద్, తహసీల్దారు నాగలక్ష్మమ్మ, నామన రాంబాబు, మద్దాల సుబ్బారావు, నేదునూరి వీర్రాజు, మోర్త వెంకటేశ్వరరావు, సలాది పుల్లయ్యనాయుడు, సయ్యపురాజు సత్యనారాయణరాజు, వర్రే శ్రీను, చిట్టూరి శ్రీనివాస్, ఇండుగుల వెంకట్రామయ్య పాల్గొన్నారు.
ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం
రాయవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాయవరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నేత ఉండవిల్లి రాంబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ చైతన్యకుమారి, కూటమినేతలు మలిపూడి చిన్న, ఉం డవిల్లి శ్రీనివాస్, కేతా శ్రీను, చిన్ని, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి పాల్గొన్నారు.
పి.గన్నవరం: కూటమి ప్రభుత్వం గడచిన 100 రోజుల్లో ప్రజారంజక పాలన అందించిందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహాక కార్యదర్శి డొక్కా నాధ్‌బాబు అన్నారు. లంకల గన్నవరంలో ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను స్థానిక కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సత్తిబాబు, మాజీ సర్పంచ్ కొపనాతి సీతారామస్వామి, లంకే భీమరాజు, వేమన రామకృష్ణ, లంకే సుబ్బారాయుడు, కామాడి రామకృష్ణ, వేమన గంగాధరరావు, పెదపూడి దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్రేయపురం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తికావడంతో సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాల కరపత్రాలను అందించి గోడకు స్టిక్కర్లను అంటించారు. ఎంపీడీవో నాతి బుజ్జి, తహసీల్దారు రాజేశ్వరరావు, వివిధశాఖల మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బందితో వెళ్లి ఇం టింటికి ప్రభుత్వం అందించిన పథకాలను వివరించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధు లు, కూటమి నేతలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన: ఎమ్మెల్యే ఆనందరావు
ఉప్పలగుప్తం: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చంద్రబాబు సారఽథ్యంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సుపరిపాలన అందించినట్టు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉప్పలగుప్తం పంచాయతీ పేరాయిచెరువులో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలనపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు అరిగెల నానాజీ, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చిక్కం కాసు, మధుర నరసింహమూర్తి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేశంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ కడిమి చిన్నవరాజు, కూటమి నాయకులు రవణం మధు, పెయ్యల దుర్గారావు, ఆకుల సూర్యనారాయణమూర్తి, చిక్కం ఉమేష్, గాలిదేవర సురేష్, ఆకేటి పెద్ద, చిక్కం సూర్యమోహన్, సలాది శ్రీనివాసరావు, దెందుకూరి సత్తిబాబురాజు, అల్లాడ స్వామినాయుడు, నల్లా బాబండి, కంకటాల రామం, మధుర ప్రతాప్, దోనిపాటి అశోక్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం
అంబాజీపేట: కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని సర్పంచ్ అక్కిశెట్టి నాగమణి పెద్ద అన్నారు. ఇరుసుమండలో ప్రత్యేకాధికారి, తహసీల్దారు జె.వెంకటేశ్వరి అధ్యక్షతన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి 100రోజుల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. పంచాయతీ కార్యదర్శి ఆర్.ఏడుకొండలుం టి, అక్కిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇది మంచి ప్రభుత్వం కరపత్రాల పంపిణీ
అల్లవరం: 100 రోజుల టీడీపీ కూటమి పాలనపై ప్రభుత్వం చేపట్టిన మంచి ప్రభుత్వం కార్యక్రమాల కరపత్రాలను గోడి, గోడిలంక గ్రామాల్లో పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబురాజు, వేగిరాజు సుబ్బరాజు(శ్రీను రాజు), ఆర్.నాగరాజు, సర్పంచ్ తోట శ్రీదేవి, ఎంపీటీసీ కాండ్రేగుల వాణిఅచ్యుతం, కార్యదర్శి కంకిపాటి సత్యనారాయణ, తోట నరసింహారావు, గాలిదేవర శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంచి ప్రభుత్వంతో మంచి రోజులు వచ్చాయి
అంతర్వేది: సఖినేటిపల్లి మండలం మోరి గ్రా మంలో ప్రజావేదికలో భాగంగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శుక్రవారం 100 రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వంతో మంచిరోజుల వచ్చాయన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.10కోట్లతో సీసీరోడ్ల ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ముప్పర్తి అలివేలుగంగత్రివేణి, ప్రత్యేకాధికారి డి.రాంబాబు, ఎంపీడీవో సత్యనారాయణ, పెదకాపు, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, మళ్లిపూడి సత్తిబాబు, గెడ్డం మహాలక్ష్మిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన ఘనత కూటమిదే : ఎమ్మెల్యే బుచ్చిబాబు
ముమ్మిడివరం: వైసీపీ ఐదేళ్ల పాలనలో అదోగతి పాలుచేసిన రాష్ట్రాన్ని వందరోజులలో గాడిలోపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే దాట్ల బుచ్చి బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి వందలరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మిడివరం మండలం సీహెచ్.గున్నేపల్లి గ్రామం లో కూటమి నాయకులతో కలసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. గ్రామం లో మొక్కలు నాటి వందరోజుల పాలనలో చంద్రబాబు అందించిన సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. సర్పంచ్ గొలకోటి దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తుల సాయి, చెల్లి అశోక్, సబతి పనేశ్వరరావు, అద్రాన్ని శ్రీనివాసరావు, యాళ్ల ఉదయ్, నడిమిటి సూర్యప్రభాకరం, కొప్పిశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి అమ్మాజీ, కూడిపూడి మల్లేశ్వరీ, దూడల స్వామినాయుడు, పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ పాల్గొన్నారు.
అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే బండారు
రావులపాలెం: సంక్షేమం,అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం గోపాలపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమ గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ 100 రోజుల్లోనే ప్రజల మన్ననలను పొందిన ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు. అనంతరం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. గుత్తుల పట్టాభిరామారావు, తోట స్వామి, చిలూవురి సతీష్‌రాజు, సబ్బిత మోహనరావు, అధికారి నాగు, మైగాపుల గురవయ్యనాయుడు, పాలూరి సత్యానందం, కాసా సాగర్, కేతా శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలను నాటారు.
అరాచక పాలనకు చరమగీతం : ఎమ్మెల్యే వేగుళ్ల
మండపేట: రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పా డి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పఽథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండలంలోని మారేడుబాకలో శుక్రవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సర్పంచ్ గోవిందరాజు అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వంద రోజులు కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు మెరుగైన పాలన అందించిందని వేగు ళ్ల అన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఎంపీడీవో సత్యన్నారాయణ, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, తహసీల్దార్ తేజేశ్వ రరావు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 12:19 AM