ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నా

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:49 AM

ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన రెండునెలల్లో అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాన ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని ఎన్డీయే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, ఆగస్టు 4: ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన రెండునెలల్లో అనపర్తి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాన ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని ఎన్డీయే కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెం డు నెలల్లోనే రంగంపేట మండలంలో రెండు ప్రధాన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని అవి త్వరలోనే పూర్తి కానున్నాయన్నారు. సామర్లకోట వేమగిరి కెనాల్‌రోడ్డు మరమ్మతులకు రూ.5.70కోట్లు, రామవరం, రాయవరం రహదారికి రూ.1.50కోట్ల నిధులు సమీకరించామని త్వరలో నే పనులు ప్రారంభమవు తాయన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలాల్లో ఏడు ఆలయాల అభివృద్ధికి సుమారు 9కోట్ల నిధులు మంజూరుకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించా రని నిధుల మంజూరుకు ప్రజావిరాళం సేకరణ పూర్తిచేసిన కమిటీలకు మొదటి ప్రాధాన్యం లభిస్తుందన్నారు. బిక్కవోలులోని లక్ష్మీగణపతి ఆల యం పునర్నిర్మాణానికి స్థల సేకరణ చేయాల్సి ఉందని ప్రజలు ప్రజా విరాళంగా భూమిని సేకరిస్తే రూ.3కోట్ల రూపాయల నిధులు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందన్నారు. అనపర్తి రైల్వే సమస్యల పరిష్కారం కోసం ఎంపీ పురందేశ్వరితో కలిసి డీఆర్‌ఎంతో చర్చించామని అనపర్తిలో జన్మభూమి హాల్ట్‌ ఇచ్చేందుకు ఆ యన సానుకూలంగా స్పందించారని అన్నారు. కెనాల్‌ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు ఎంపీ పురందేశ్వరితో కలిసి కేంద్ర మంత్రి గడ్కారీని కలవనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూ డి సుఽధాకర రెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, మామిడిశెట్టి శ్రీను, నూతిక బాబూరావు, బాసి, ఒంటిమి సూర్యప్రకాష్‌, చింతా ప్రకాశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 12:50 AM

Advertising
Advertising
<