ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళల రక్షణకు ప్రత్యేక టీమ్‌లు

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:44 AM

ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో మహిళలు,చిన్న పిల్లల రక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్‌ఐజీ జివిజి.అశోక్‌ కుమార్‌ తెలిపారు.

గోకవరంలో రికార్డులు తనిఖీ చేస్తున్న ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌

గోకవరం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఆరు జిల్లాల్లో మహిళలు,చిన్న పిల్లల రక్షణకు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్‌ఐజీ జివిజి.అశోక్‌ కుమార్‌ తెలిపారు. వార్షిక తని ఖీలో భాగంగా గోకవరం పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం సందర్శించి మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేద న్నారు. ఉమెన్‌, మేల్‌ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీమ్‌లను మహిళల రక్షణకు ఏర్పాటు చేశా మన్నారు.ఏజెన్సీ ముఖద్వారం తూర్పు గోదా వరి జిల్లా ఉండడంతో గంజాయి అక్రమ రవాణా ఎక్కువుగా జరుగుతుందన్న సమా చారం ఉందన్నారు.గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేప ట్టామన్నారు. సోషల్‌ మీడియా ద్వారా అసభ్య కరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేద న్నారు. రేంజ్‌ పరిధిలో ఉన్న ఆరు జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు 60 వేల నుంచి 70 వేల వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా మన్నారు. మరో 30 వేల కెమెరాలు ఏర్పాటు చేస్తే కేసుల్లో మంచి పురోగతి లభించే అవ కాశం ఉంటుందన్నారు. నిందితుల ముఖాలను గుర్తు పెట్టే కెమెరాలు త్వరలో రానున్నాయని, వాటి వల్ల కూడా పోలీస్‌ వ్యవస్థకు మరింత మేలు జరగనుందన్నారు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గోకవరం ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన సీసీ కెమె రాలను పునఃప్రారంభించారు. ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ నుంచి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు. దేవిచౌక్‌ సెంటర్‌లో కనకదుర్గ అమ్మవారిని ఐజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఆయన వెంట ఏఎస్పీ సుబ్బరాజు,సీఐ వై.సత్యకిషోర్‌ ఉన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:44 AM