ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ సీజ్‌

ABN, Publish Date - May 23 , 2024 | 11:28 PM

తాళ్లరేవు, మే 23: యానాం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను రాజమహేంద్రవరం రీజనల్‌ విజిలెన్స్‌/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం పి.మల్లవరం చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నట్టు సివిల్‌సప్లయ్‌ అధికారిణి లక్ష్మీప్రస న్న తెలిపారు. డీజిల్‌ అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేర

పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద ఆయిల్‌ట్యాంకర్‌ను పట్టుకున్న అధికారులు

తాళ్లరేవు, మే 23: యానాం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న డీజిల్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను రాజమహేంద్రవరం రీజనల్‌ విజిలెన్స్‌/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం పి.మల్లవరం చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నట్టు సివిల్‌సప్లయ్‌ అధికారిణి లక్ష్మీప్రస న్న తెలిపారు. డీజిల్‌ అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం మేరకు విజిలెన్స్‌, రెవెన్యూ, సివిల్‌సప్లయ్‌ అధికారులు సంయుక్తంగా పోలేకుర్రు చెక్‌పోస్టు వద్ద అశోక్‌లేలాండ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ వాహనాన్ని పట్టుకున్నారు. సదరు ఆయిల్‌ ట్యాంకర్‌ నందు రూ.8,39,000 విలువచేసే 4000లీటర్లు డీజిల్‌ ఉన్నట్టు గుర్తించారు. యానాంలోని ఇండియన్‌ అయిల్‌ పెట్రోల్‌బంక్‌ నుంచి ఆయిల్‌ట్యాంకర్‌ డ్రైవర్‌ గోవాల సుబ్బారావు అలియాస్‌ సుధీర్‌ టాటాఏసీ వాహనం ద్వారా లీటరు రూ.84కు కొనుగోలుచేసి తదుపరి మోటార్‌, పైపు సాయంతో అశోక్‌ లేలాండ్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ వాహనంలోకి లోడు అవుతుంది. అశోక్‌ లేలాండ్‌ ట్యాంకర్‌/టాటా ఏసీ వాహనం యజమాని అడ్డాల వీర వెంకట సత్యనారాయణ ఆదేశాల మేరకు సదరు డీజిల్‌ను తాళ్లరేవుకు రవాణా చేసి అక్కడ గల చేపలు, రొయ్యల చెరువుల మోటార్‌ ఇంజన్లుకు లీటరు రూ.88కు అమ్మ కము చేయనున్నారు. ట్యాంకర్‌ను సీజ్‌ చేసి రవాణా చేసే వ్యక్తులపై క్రిమినల్‌ కేసులకు కోరింగ పోలీసులకు సిఫార్సు చేశారు. తనిఖీల్లో రిజనల్‌ విజిలెన్స్‌ ఎస్సీ కెఎస్‌. సుబ్బారెడ్డి, విజిలెన్స్‌ అధికారులు జగన్నాధరెడ్డి, లక్ష్మీనారాయణ, డిఎస్‌వో ప్రసాద్‌, మ ండల సివిల్‌ సప్లయ్‌ అధికారిణి టి.లక్ష్మీప్రసన్న, రమణలక్ష్మిదేవి, లోవరాజు ఉన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:28 PM

Advertising
Advertising