ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇళ్ల వద్దకే వైద్యపరీక్షలు

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:05 AM

ప్రజల వద్దకే ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారని రంగంపేట పీహెచ్‌సీ వైద్యాఽధికారిణి బి.వేణుశ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించిన నేషనల్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగామ్‌(ఎన్‌సీడీసీడీ 3.0), రాష్ర్టీయ బాల ఆరోగ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లను రంగంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద శుక్రవారం ఆమె ప్రారంభించారు.

రంగంపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు ప్రారంభిస్తున్న దృశ్యం

  • రంగంపేట పీహెచ్‌సీ డాక్టర్‌ వేణుశ్రీలక్ష్మి

రంగంపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రజల వద్దకే ఇంటింటికీ వెళ్లి వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారని రంగంపేట పీహెచ్‌సీ వైద్యాఽధికారిణి బి.వేణుశ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రారంభించిన నేషనల్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగామ్‌(ఎన్‌సీడీసీడీ 3.0), రాష్ర్టీయ బాల ఆరోగ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)లను రంగంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్ద శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మండలంలోని 19 గ్రామ సచివాలయాల్లో ఉన్న ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో వ్యాధుల నియంత్రణ, అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్య సేవల ప్రభావాన్ని మెరుగుపరుస్తారన్నారు. ఇంటి వద్దనే బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తారని, కేన్సర్‌ స్ర్కీనింగ్‌ చేయడం, కేనర్స్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లల్లో వ్యాఽధులను గుర్తించడానికి, చికిత్స అందించడానికి విస్తృత సేవలు అందిస్తా రని వేణుశ్రీలక్ష్మి చెప్పారు. కార్యక్రమంలో వైద్యాఽధికారులు కె.చిన్నారావు, కె.సంకీర్తన, సీహెచ్‌వో కె.జయమణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:05 AM