221 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:28 AM
జిల్లా వ్యాప్తంగా 221 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.రాధిక పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాధిక
పెరవలి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 221 రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ పి.రాధిక పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరిరైతులు పరిస్థితి తెలుసుకునేందుకు శనివారం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ కామన్ వెరైటీ క్విం టా ధాన్యం రూ.2,300 చొప్పున, ఏ గ్రేడ్ వెరైటీ రూ.2,320 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 19,916 మంది రైతుల నుం చి 28,727 ఎఫ్‌టీవోల ద్వారా 1,57,700 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు తెలిపారు. దీని నిమిత్తం రైతులకు రూ.300కోట్ల 64లక్షలు జమ చేసినట్టు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే వరి పంట కోసిన రైతులు ధాన్యం మిల్లులకు తరలించారని మిగిలిన రైతులు వర్షాలు తగ్గే వరకు కోతలు కోయవద్దని సూచించారు. రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే జిల్లా కంట్రోల్ రూమ్ నెంబరు 83094 87151 నెంబరుకు గాని, టోల్‌ఫ్రీ నెంబరు 1967కు గాని ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంట తహశీల్దార్ అచ్యుతకుమారి, వ్యవసాయ సిబ్బంది మౌనిక, మాసరమ్మ పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:28 AM