జిల్లా స్థాయిలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్
ABN, Publish Date - Dec 07 , 2024 | 01:20 AM
జిల్లాస్థాయిలో తొలి దశలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు.
త్వరలో మండల, డివిజన్ స్థాయి పోటీలకు ఏర్పాట్లు
అమలాపురం టౌన్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయిలో తొలి దశలో విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. రెండో దశలో వివిధ శాఖల ఉద్యోగులకు జిల్లాస్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తామన్నారు. స్పోర్ట్స్‌మీట్ నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, స్కూలుగేమ్స్ ఫెడరేషన్, జిల్లా క్రీడాప్రాథికార సంస్థ, వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా విద్యార్థులకు రెండు విభాగాలుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. 4,5,6 తరగతుల విద్యార్థినీ విద్యార్థులను మొదటి కేటగిరిగా గుర్తించి మండలస్థాయిలో ఫైనల్ పోటీలు పూర్తిచేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలు బహూకరించాలన్నారు. రెండో కేటగిరీలో 7,8,9 తరగతుల విద్యార్థులకు డివిజన్‌స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను జిల్లాస్థాయి పోటీలకు పంపించాలని కలెక్టర్ సూచించారు. క్రీడాపోటీలకు అవసరమైన క్రీడాసామగ్రి కిట్లు, క్రీడాదుస్తులు, బూట్లు, అల్పాహారం, భోజన వసతుల కల్పన, పతకాలు, ప్రశంసాపత్రాలు, బహుమతలకయ్యే ఖర్చుల అంచనాలను రూపొందించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, త్రోబాల్, కోకో, బాస్కట్‌బాల్ తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు మూడు టీముల చొప్పున జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లకు 9టీములను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ముఖ్య శిక్షకుడు పీఎస్ సురేష్‌కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా, తోట రవి, ఐ.భీమేష్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో కార్యాలయ
Updated Date - Dec 07 , 2024 | 01:20 AM