ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:05 AM

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే గురుపూజోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యా య అవార్డులను ప్రధానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. రాజమహేంద్రవరంలో నగర పాలకసంస్థ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాఽధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు.

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 4: డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతిఏటా నిర్వహించే గురుపూజోత్సవంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యా య అవార్డులను ప్రధానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. రాజమహేంద్రవరంలో నగర పాలకసంస్థ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాఽధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుల విభాగంలో శ్రీనాగరాజా నగరపాలక సంస్ధ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం టీ.చక్రధర్‌, జాంపేట లూధరన్‌ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎన్‌.మేరి పెరల్స్‌లు ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డుకు ఎంపికయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్స్‌ విభాగంలో ఎస్‌కేవీటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎఎల్‌ నరసింహరావు, శ్రీనివాసరామానుజన్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎ.సూరిబాబులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అదేవిధంగా ఎస్‌జిటి విభాగంలో నగరంలో సీతంపేట పంతం సత్యనారాయణ మునిసిపల్‌ ప్రాఽథమిక పాఠశాల ఉపాధ్యాయులు బి. చైతన్యకుమార్‌, సెయింట్‌జాన్స్‌ రివర్‌ డేట్‌ ఉపాధ్యాయిని టీఎస్‌ సరోజినిదేవి, డీఎమ్‌హెచ్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు దాసరి శివసత్యమూర్తి జిల్లా ఉత్తయ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. స్ధానిక వెంకటేశ్వర ఆనంకళాకేంద్రంలో గురువారం ఉదయం 10గంటలకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులను ఉపాధ్యాయులకు ప్రధానం చేస్తారని డిఐ దిలిప్‌ కుమార్‌ తెలిపారు.

రాజానగరానికి ఆరు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

రాజానగరం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉపాధ్యా యులకు ఇచ్చే పురస్కారాలు ఈఏడాది రాజానగరం మండలానికి ఆరు వరించాయి. వివరాలను మండల విద్యాశాఖాధికారి-1 రామన్నదొర బుధవారం వెల్లడించారు. మండలంలోని చక్రద్వారబంధం హైస్కూల్‌ నుంచి ప్రధానోపాధ్యా యుడు జీవీవీఎస్‌ సీతారామయ్య, పుణ్యక్షేత్రం హైస్కూల్‌ నుంచి గణిత ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ, లాలాచెరువు హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉందుర్తి సుబ్బారావు, పాతతుంగపాడు హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ వి.సురేష్‌బాబు, శ్రీకృష్ణపట్నం ఎంపీపీ ప్రాఽథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట దుర్గా ప్రసాదరావు, రాజానగ రంలోని ఎంపీపీఎస్‌ నెం-1 పాఠశాల ఉపాధ్యాయుడు పడాల శైలజ దుర్గాభవాని ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా విజయలక్ష్మి, సత్యనారాయణ ఎంపిక

బిక్కవోలు: బిక్కవోలు మండలం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా కొంకుదురు మెయిన్‌ ప్రాథమిక పాఠశాలలో పీఎస్‌హెచ్‌ఎంగా పనిచేస్తున్న వి.విజయకుమారి, బిక్కవోలు ఉన్నత పాఠశాలలో ఒకేషనల్‌ టీచర్‌గా పనిచేస్తున్న పి.సత్యనారాయణ ఎంపికైనట్లు మండల విద్యాశాఖాధికారి సీహెచ్‌వీవీ సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఎంపికైన వారు రాజమహేంద్రవరంలో గురువారం జరిగే గురుపూజోత్సవంలో జిల్లా కలెక్టర్‌ నుంచి అవార్డులు తీసుకుంటారన్నారు. ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను మండల ఎస్‌టీయూ, యూటీఎఫ్‌ శాఖ నేతలు, అభినందించారు.

రంగంపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగంపేట మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారని ఎంఈవో కె.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ గోవిందరాజాపురం మండల ప్రజా పరిషత్‌ ప్రాఽథమిక పాఠశాలలో పనిచేస్తున్న బెల్లపు విజయలక్ష్మీ, పి.కోటపాడు మండల ప్రజా పరిషత్‌ ప్రాఽథమికోన్నత పాఠశాలలో సోషల్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న సీహెచ్‌ విజయరత్నం ఎంపికయ్యారని తెలిపారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రసాద్‌, సత్యనారాయణ

కడియం: కడియపులంక జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌-స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న జోళ్ల సత్యసాయి విజయప్రసాద్‌కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకి ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ప్రసాద్‌ను సర్పంచ్‌-ఇన్‌చార్జి పాటంశెట్టి రాంజీ, రాష్ట్ర టీడీపీ నాయకులు మార్గాని సత్యనారాయణ, పల్ల సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎం కె.జయలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు కడియం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టిల్లపూడి సత్యనారాయణకు ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సత్యనారాయణను ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌, గిరజాల బాబు, సర్పంచ్‌ మోసిగంటి సత్యవతి, ఉపసర్పంచ్‌ వెలుగుబంటి నాని, ఎస్‌ఎంసీ సబ్యులు, ఎంఈవోలు, ఉపాధ్యాయలు అభినందించారు. అలాగే దామిరెడ్డిపల్లి నెంబర్‌-2 పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు సబ్బితి శ్రీనివాస్‌ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో తెలిపారు.

అనపర్తి మండలంలో ముగ్గురికి అవార్డులు

అనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం అందించే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అనపర్తి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికైనట్లు ఎంఈవో నల్లమిల్లి సత్తిరెడ్డి తెలిపారు. అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నాగార్జున, అనపర్తి ప్రాథమి కోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అనూరాద, పొలమూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు విజయదుర్గలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ట్లు ఆయన తెలిపారు. వీరిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.

కోరుకొండ మండలం నుంచి ఐదుగురికి అవార్డులు

కోరుకొండ: కోరుకొండ మండలంలో పని చేస్తున్న ఐదుగురికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. వీరిలో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పండిట్‌లుగా పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒకరు హైస్కూల్‌ గెజిటెట్‌ హైస్కూల్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఎస్జీటీ విభాగంలో కోరుకొండ మండలం కాపవరం ప్రాఽథమిక పాఠశాలలో పనిచేస్తున్న వి.కృపావతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మధురుపూడి ప్రాఽథమిక పాఠశాలలో ఆర్‌.నాగేశ్వరరావులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హెడ్‌మాస్టర్స్‌ విభాగంలో కోటికేశరం జడ్పీ హైస్కూల్‌లో గెజిటెట్‌ హెచ్‌ఎంగా పని చేస్తున్న కేవీ సత్యనారాయణ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఎస్‌ఏ విభాగంలో కోరుకొండ మండలం గుమ్ముళ్ళూరు జడ్పీ హైస్కూల్‌లో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న ఆర్‌. హేమంత్‌కుమార్‌, కోటికేశవరం జడ్పీ హైస్కూల్‌లో ఎస్‌ఏ ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి. సమాధానంలు ఉన్నారని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు, మండల విద్యాశాఖాధికారి టికుశలవదొరలు తెలిపారు.

మండల స్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

కోరుకొండ మండలంలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉపాధ్యాయుల్లో ఏడుగురు ఉపాధ్యాయులకు మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయఅవార్డులు లభించాయి. వీరిలో గాదరాడ స్కూల్‌ కాంప్లెక్స్‌ నుంచి రాజవరం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ డీవీఏ ధనలక్ష్మి, గాదరాడ వీరభద్రపురం, ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఎంటీఎస్‌గా పని చేస్తున్న పుల్లెపు గంగరాజు కాపు, కోరుకొండ స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో మునగాల యూపీ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న డి.ఉషారాణి, శ్రీరంగపట్నం స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని శ్రీరంగపట్నం శివాలయం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎం.వరలక్ష్మి, రాఘవాపురం ప్రాఽథమిక పాఠశాలలో ఎస్జీటీ గా పనిచేస్తున్న ఎ.షకీనా, గాడాల స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో గాడాల జడ్పీ హైస్కూల్‌లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రెక్టర్‌గా పనిచేస్తున్న కె. మంగాదేవి(పీటీఐ), కోరుకొండ ఎంఆర్‌సీలో సీఆర్పీగా పని చేస్తున్న సీహెచ్‌ వెంకటేశ్వరరావులు మండల స్ధాయిలో ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సీఆర్పీ, ఉత్తమ ఇన్‌స్ట్రెక్టర్‌లుగా ఎంపికైనట్లు మండల విద్యాశాఖాధికారి టి. కుశలవ దొర బుధవారం ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 01:06 AM

Advertising
Advertising