ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడి మృతి

ABN, Publish Date - May 21 , 2024 | 11:54 PM

కాకినాడ జీజీహెచ్‌లో కొంత మంది వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడి మృతి చెందడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వైద్య సేవలు అందించకుండా శ్వాస ఆడటం లేదని వేడుకున్నా కనికరించకుండా అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాకినాడ క్రైం, మే 21 : కాకినాడ జీజీహెచ్‌లో కొంత మంది వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడి మృతి చెందడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో వైద్య సేవలు అందించకుండా శ్వాస ఆడటం లేదని వేడుకున్నా కనికరించకుండా అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, సరైన చికిత్స చేయకుండా మృతదేహానికి సెలైన్‌ పెట్టారనే ఆరోపణలతో కుటుంబ సభ్యులు మంగళవారం కాకినాడ జీజీహెచ్‌లో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకెళితే యానాం గిరియాంపేట మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మేడా లోకేష్‌ (60) సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత దగ్గు వచ్చి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్య సేవల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 2 గంటలకు జీజీహెచ్‌లో చేర్పించారు. నాన్‌ ఎమ్మెల్సీ వార్డులో చేర్చి ఆక్సిజన్‌ పెట్టిన కాసేపటికే లోకేష్‌ కోలుకున్నాడు. వృద్ధాప్యం కావడంతో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమోననే కారణంతో సీనియర్‌ వైద్యులు సూచన మేరకు జూనియర్‌ వైద్యులు వార్డుకి తరలించారు. ఆ తర్వాత కాసేపటికి శ్వాస ఆడటం లేదని వైద్యులకు చెప్పడంతో ఇంజక్షన్లు చేశారు. ఇంజక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికి కడుపు బాగా ఉబ్బిపోయి శ్వాస ఆడటం లేదని చెప్పడంతో కుమారుడు రాజు వైద్యులకు ఈ విషయం చెప్పాడు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఊపిరి ఆడటం లేదంటూ కేకలు వేసి కుప్పకూలిపోయాడని కుమారుడు రాజు తెలిపారు. ఇంతలో వైద్యులు వచ్చి వృద్ధుడి గుండె, పొట్టపై నొక్కి సీపీఆర్‌ చేసి బతికించే ప్రయత్నం చేసి, ఆక్సిజన్‌ పెట్టారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వార్డు నుంచి డాక్టర్లు సీఐసీయూకి తరలించి, అక్కడ సెలైన్‌ బాటిల్‌ ఎక్కించారు. అప్పటికే తండ్రి లోకేష్‌ మృతి చెందడంతో పొట్టఉబ్బిపోయిందన్నారు. అయినా డాక్టర్లు సెలైన్‌ బాటిల్‌ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత డాక్టర్లు సిలెన్‌ బాటిల్‌ ఎక్కించారని ఆరోపించాడు. వైద్యుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఆవరణలో భార్య రామయమ్మ, కుమారడు రాజులతో బంధువులు ఆందోళన చేపట్టారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆస్పరత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీధర్‌లకు ఫిర్యాదు అందించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్‌ కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Updated Date - May 21 , 2024 | 11:54 PM

Advertising
Advertising