ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సభకు ఏడు బస్సులు

ABN, Publish Date - Dec 12 , 2024 | 12:25 AM

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13న స్వర్ణాంధ్ర-2047 డ్యాకుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించారని తెలిపారు.

జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి

అమలాపురం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13న స్వర్ణాంధ్ర-2047 డ్యాకుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించారని తెలిపారు. డాక్యుమెంటు ఆవిష్కరణ సభకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఏడు బస్సులను ఏర్పాటు చేసి సుమారు 350 మందిని తరలిస్తామన్నారు. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన మరొక కీలక ఘట్టంగా విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ నిలుస్తుందన్నారు. పర్యటన ఏర్పాట్లపై బుధవారం జిల్లాస్థాయి అధికారులతో జేసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆవిష్కరణ సభకు జిల్లా నుంచి 75 మంది డ్వాక్రా మహిళలను, 50 మంది ఉపాధి హామీ పథకం సభ్యులను, 25 మందిని మత్స్యశాఖ నుంచి, 40 మంది వ్యవసాయశాఖ, 40 మంది ఉద్యానశాఖ, 50 మంది విద్య అకడమిక్‌ విభాగం, 20 మంది వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా పరిశ్రమల శాఖ నుంచి 15 మందిని తరలిస్తామన్నారు. ఏడు బస్సులకు ఇన్‌చార్జిలను సమన్వయ అధికారులను నియమించామన్నారు. ఏ నియోజకవర్గంలో బస్సును ఎక్కడ ఉంచుతారో ఆ లోకేషన్‌ను మొబైల్‌ ద్వారా పంపిస్తామన్నారు. 13వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు బయలుదేరి 9.30 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకోవాలన్నారు. తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆర్డీవో, తహశీల్దార్‌ను నియమించామన్నారు. ఇందు కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, కలెక్టరేట్‌ ఏవో కడలి కాశీవిశ్వేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ శివరామ్‌ప్రసాద్‌, సీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, డీఎస్పీ ఎస్కేవీడీ ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 12:25 AM