నిరంతర కృషితో పోటీ పరీక్షల్లో గెలుపు
ABN, Publish Date - Nov 28 , 2024 | 12:25 AM
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్లను బీసీ వెల్ఫేర్
కలెక్టర్ ప్రశాంతి
సివిల్స్ ఉచిత శిక్షణ స్ర్కీనింగ్ పరీక్షకు 70 మంది హాజరు
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నిరంతర సాధన, కృషితోనే పోటీ పరీక్షల్లో గెలుపు సాధ్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకున్న ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులకు స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్లను బీసీ వెల్ఫేర్ అధికారులతో కలసి కలెక్టర్ ఓపెన్ చేశారు. అనంతరం పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మొత్తం 75 దరఖాస్తులు వచ్చాయని, స్ర్కీనింగ్ పరీక్షకు 70 మంది హాజరయ్యారని అన్నారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గొల్లపూడి కేంద్రంలో ఆరు నెలలపాటు ఉచితంగా శిక్షణ, స్టయిఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సివిల్స్ కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు పట్టుదలతో ప్రయత్నించి శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్ర్కీనింగ్ పరీక్షల నిర్వహణను ఆర్డీవో కృష్ణనాయక్, బీసీ వెల్ఫేర్ అధికారిణి కేఎన్ జ్యోతి, సహాయ బీసీ వెల్ఫేర్ అధికారి సత్యరమేష్, ఇతర అధికారులు పరిశీలించారు.
Updated Date - Nov 28 , 2024 | 12:25 AM