ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళారులను నమ్మి మోసపోవద్దు

ABN, Publish Date - Oct 28 , 2024 | 12:25 AM

దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. జిల్లాలో 370 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నవంబరు 6 నుంచి ప్రారంభిస్తామన్నారు. 2024-25 ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యానికి నాణ్యతా ప్రమాణాలకు లోబడి మద్దతు ధర కల్పిస్తామన్నారు. గతంలో ఉన్న ర్యాండమైజేషన్‌ ప్రస్తుతం లేదని, రైతులు తమకు నచ్చిన రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు.

అమలాపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. జిల్లాలో 370 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నవంబరు 6 నుంచి ప్రారంభిస్తామన్నారు. 2024-25 ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యానికి నాణ్యతా ప్రమాణాలకు లోబడి మద్దతు ధర కల్పిస్తామన్నారు. గతంలో ఉన్న ర్యాండమైజేషన్‌ ప్రస్తుతం లేదని, రైతులు తమకు నచ్చిన రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుని విక్రయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు. ఖరీఫ్‌లో సాధారణ రకం క్వింటా దాన్యానికి రూ.2300, 75 కిలోలకు రూ.1725, గ్రేడ్‌-ఏ రకం క్వింటా ధాన్యం రూ.2320, 75 కిలోల ధాన్యం రూ.1740 ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతీ దశలోను ఐదు పర్యాయాలు రైతుల మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపిస్తామన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించాల్సిన తేదీ, సమయంతో కూడిన కూపన్‌ను రైతులకు అందజేస్తారన్నారు. నిర్దేశించిన తేదీన సాంకేతిక నిపుణుడు రైతుల కళ్లాల వద్దకు ధాన్యం నమూనాలను సేకరించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను విశ్లేషిస్తారర్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్టయితే ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. రైతుల నుంచి బయోమెట్రిక్‌ వేలి ముద్రలు తీసుకుంటారని, ధాన్యం వివరాలతో కూడిన రశీదు రైతులకు అందజేస్తారన్నారు. సేకరించిన ధాన్యాన్ని రైతు కోరిన రైసుమిల్లుకు జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌తో కూడిన వాహనాల్లో రవాణా చేస్తారని చెప్పారు. రైతు ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు ఖాతాకు నేరుగా సొమ్ము జమ చేస్తామన్నారు. రైతులకు బహిరంగ మార్కెట్‌లో తాము పండించిన ధాన్యానికి అధిక ధర లభించినట్టయితే అమ్ముకోవచ్చునని, ధాన్యం పరిమాణ వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జేసీ నిషాంతి సూచించారు.

Updated Date - Oct 28 , 2024 | 12:25 AM