ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తినష్టం

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:23 AM

రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్థం కాగా రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించింది.

రాయవరం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్థం కాగా రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించింది. బాధితుల వివరాల ప్రకారం...అంబేద్కర్‌నగర్‌కు చెందిన యాళ్ల సుం దరరావు, యాళ్ల సత్యనారాయణ కుటుంబాలు తాటాకింట్లో ఉంటున్నారు. ఆదివారం అర్థరాత్రి సత్యనారాయణ, సుందరరావులు గాడనిద్రలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బాధితులు మేల్కొని బయటకు వచ్చేలోపు అగ్ని కీలలు వ్యాపించడంతో వారంతా బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్‌ సిలెండర్లు లీక్‌ కావడంతో చుట్టు ప్రక్కల ఇళ్లవాళ్లు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇళ్ల నిర్మాణ నిమిత్తం అప్పుగా చేసి తెచ్చిన నగదు, సర్టిఫికెట్లు, ఆధార్‌, రేషన్‌ కార్డులు, ఇంట్లో ఉన్న సామగ్రి దగ్థమైనట్టు వారు తెలిపారు. తమకు చెరో 5లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదా నికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దారు ఐపీ శెటి సిబ్బందితో పరిశీలించి బాధిత కుటుంబాలకు ఒకొక్కరికి 25 కిలోల బియ్యం అందజేశారు. బాధితులను టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు చుండ్రు వీర్రాజు, మాజీ సర్పంచ్‌లు నూనె ఏసుబాబు, మోరంపూడి రాజ్‌కుమార్‌, ముత్యాల సాయిరాం, సత్య ప్రసాద్‌ పరామర్శించారు.

Updated Date - Nov 19 , 2024 | 01:23 AM