ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిష్‌ లాండింగ్‌ కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:01 AM

అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి ఓడరేవు ఫిష్‌ లాండింగ్‌ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలను ఎదుర్కొనే సన్నద్ధతను పరిశీలించేందుకు బుధవారం ఆయన అల్లవరం మండలంలో పర్యటించారు.

అల్లవరం, సెప్టెంబరు 4: అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి ఓడరేవు ఫిష్‌ లాండింగ్‌ కేంద్రంలో పూర్తి సౌకర్యాలు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలను ఎదుర్కొనే సన్నద్ధతను పరిశీలించేందుకు బుధవారం ఆయన అల్లవరం మండలంలో పర్యటించారు. ఓడలరేవు ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాన్ని సందర్శించి వేలం పాట గది, వలలు అల్లుకునే గదులను ఎప్పుడు నిర్మిస్తారనే అంశంపై ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ అయిన హెడ్‌వర్క్స్‌ అధికారులను ఆరా తీశారు. ఫిష్‌ లాండింగ్‌ నిర్మాణం జెట్టి నిర్మాణం పూర్తయిందని మిగిలిన పనులను త్వరలోనే పూర్తిచేస్తామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. త్వరలో మిగిలిన సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్‌ వరద సమయంలో ముంపు సమస్యకు కారణం అవుతున్న గోడితిప్ప శివారు గోపాయిలంక కుమ్మరికాలువ డ్రైయిన్‌పై ఉన్న అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ను పరిశీలించారు. అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లో ఉన్న 8 షటర్లకు మరమ్మత్తులు చేయాల్సి ఉందని, ఒక షటర్‌ పూర్తిగా దెబ్బతిందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. పాడైన షట్టర్‌ స్థానంలో కొత్త షటరు ఏర్పాటు చేసి రైతులకు సమీప గ్రామాలకు ముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ కొత్త తలుపులు ఏర్పరచడానికి రూ.80 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామని కలెక్టర్‌కు తెలిపారు. గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లను అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. డ్రైన్లు గోదావరి నదీలో కలిసే ప్రాంతాల వద్ద చెత్తా చెదారాల వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి పంటపొలాలు ముంపునకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దారు ఎస్‌విఎస్‌ నరసింహరావు, ఎంపీడీవో కృష్ణమోహన్‌, సర్పంచ్‌లు మల్లాడి మంగాయమ్మ, చిట్నిడి శ్రీదేవి, రొక్కాల విజయలక్ష్మితో పాటు మల్లాడి ఉమామహేశ్వరరావు, చిట్నిడి శ్రీనివాస్‌, ఇరిగేషన్‌, డ్రైనేజీ, హెడ్‌వర్క్స్‌, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 01:01 AM

Advertising
Advertising