పైప్‌లైన్ తొలగించాలని మత్స్యకారుల బైఠాయింపు
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:39 AM
సెజ్‌లో నెలకొల్పిన లైఫిజ్ రసాయన కంపెనీ సముద్రంలోకి ఏర్పాటుచేసిన పైప్‌లైన్‌ను తొల గించాలని, మత్స్యకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట గ్రామానికి చెం దిన మత్స్యకారులు గురువారం ఆర్‌అండ్‌బీ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
కొత్తపల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సెజ్‌లో నెలకొల్పిన లైఫిజ్ రసాయన కంపెనీ సముద్రంలోకి ఏర్పాటుచేసిన పైప్‌లైన్‌ను తొల గించాలని, మత్స్యకారుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట గ్రామానికి చెం దిన మత్స్యకారులు గురువారం ఆర్‌అండ్‌బీ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కోనపాపపేట మీదుగా బీచ్‌రోడ్డున తుని వెళ్లే ప్రధాన రహదారులన్నీ మత్స్యకారులు బంద్ చేశారు. దీంతో మూల పేట నుంచి నాగులాపల్లి మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. ఉదయం 6 గంటల నుంచి గ్రామంలో మత్స్యకారులు అందరూ రోడ్డుకు చేరి ధర్నాలో పాల్గొన్నారు. సెజ్‌లో నెలకొల్పిన రసాయన పరిశ్రమల కార ణంగా మత్స్య సంపద అంతరించి తద్వారా జీవనోపాధికి ఆటంకం ఏర్పడుతుందని, సముద్రంలోకి ఏర్పాటుచేసిన పైప్‌లైన్ తొలగించా లని, అదేవిధంగా రసాయన పరిశ్రమల నుంచి రూ.6కోట్లు ముడు పులు తీసుకొన్న మత్స్యకారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్ సమక్షంలో సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేదని లేదని మత్స్యకారులు స్పష్టంచేశారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ చొరవతో ఆందోళన విరమణ
మత్స్యకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఎన్నికల ముందు రసాయన పరిశ్రమల కాలు ష్యంపై పోరాటంచేసిన సభ్యులకు పరిశ్రమల యాజమాన్యం డబ్బు లు ముట్టజెప్పారన్న ఆరోపణలు, రసాయన పరిశ్రమల వల్ల సము ద్రంలో మత్స్యసంపద అంతరించి జీవనోపాధికి ఆటంకం ఏర్పడు తుందని, తమకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని, తుని నియో జకవర్గంలో మత్స్యకారులకు రేషన్‌కార్డు ఆధారంగా డబ్బులు ఇచ్చా రనే ఆరోపణలను తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే వర్మ కలెక్టర్ షాన్ మోహన్‌కు ఫోన్‌లో వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో ఎస్.మల్లిబాబు చేరుకుని మత్స్యకారులతో చర్చించారు. నష్టపరి హారం చెల్లించారన్న ఆరోపణలపై ఈనెల 20న ఆరబిందో ఫార్మా కం పెనీతో చర్చిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Updated Date - Dec 06 , 2024 | 01:39 AM