వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి
ABN, Publish Date - Oct 06 , 2024 | 12:33 AM
గోదావరిలో వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలని సూచనలు చేసిన నేపథ్యంలో ర్యాంపులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
రావులపాలెం, అక్టోబరు 5: గోదావరిలో వరద నీరు తగ్గిన వెంటనే ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో ఇసుక ర్యాంపుల నుంచి తవ్వకాలు నిర్వహించాలని సూచనలు చేసిన నేపథ్యంలో ర్యాంపులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలోని రెండు ఇసుక ర్యాంపులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఇసుక తవ్వకాలకు ప్రస్తుత పరిస్థితి, గోదావరి వరద నీరు తగ్గిందా లేదా అనే అంశాలను పరిశీలించారు. గోదావరిలో వరద నీరు పూర్తిగా తగ్గిన వెంటనే తవ్వకాలు చేపట్టాలన్నారు. ఆయన వెంట కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, గనులు, భూగర్భ శాఖ రియాల్టీ ఇన్‌స్పెక్టర్ టి.సుజాత, ఆర్‌ఐ రవికుమార్ పాల్గొన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 12:33 AM