ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల సరిహద్దులను గుర్తించాలి

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:37 AM

జిల్లాలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల సరిహద్దులను గుర్తించేందుకు రెవెన్యూ, అటవీ, సర్వేశాఖ ఉమ్మడి తనిఖీచేయాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావే శం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ షాన్‌మోహన్‌, అటవీ అధికారిణి భరణి

  • జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌

కాకినాడ సిటీ, సెప్టెంబరు 20: జిల్లాలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాల సరిహద్దులను గుర్తించేందుకు రెవెన్యూ, అటవీ, సర్వేశాఖ ఉమ్మడి తనిఖీచేయాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావే శం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారిణి ఎస్‌ భరణి, అడిషన ల్‌ ఎస్పీ శ్రీలక్ష్మి, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు. అటవీ సరి హద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించడం, చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు, మడ అడవుల్లో సారా తయారీ, అక్రమ మద్యం రవాణా నివారణ అంశాలపై కలెక్టర్‌ చర్చించారు. సమావేశంలో ఆర్డీవోలు ఇట్ల కిషోర్‌, జే సీతారామారావు, సబ్‌డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి అనూష, ఫారెస్ట్‌ సెటిల్మెంట్‌ అధికారి ఎ.చంద్ర మౌళీశ్వరి, సర్వే, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ బి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

  • జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లపై నిఘా కొనసాగించాలి : కలెక్టర్‌

కాకినాడ సిటీ, సెప్టెంబరు 20 : ఆలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ ప్రక్రియను గర్భస్థ పిండలింగ నిర్థారణలకోసం దుర్విని యోగం కాకుండా నివారించేందుకు జిల్లాలోని స్కానింగ్‌ సెంటర్లపై నిరంతర నిఘా, నిశితమైన పర్యవేక్షణ కొనసా గించాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదే శించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కోర్టు హాల్‌లో గర్భస్థ పిండ లింగ నిర్థారణ, వెల్లడి నిషేధ చట్టం, ఏఆర్డీ అండ్‌ సరోగసీ యాక్ట్‌ల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన, సంరక్షణ కోసం నిర్దేశించిన అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ పరీక్షా విధానం పిండ లింగ నిర్థా రణకు దుర్వినియోగం చేయడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరమన్నారు. దీన్ని నిషేధిస్తూ చేసిన చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమా వేశంలో అడిషనల్‌ ఎస్పీ కే శ్రీలక్ష్మి, డీఎఫ్‌వో ఎస్‌ భరణి, డీఎంహెచ్‌వో జే నరసింహనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కేపీ సరిత, ఇన్‌చార్జి డీఐవో ఆర్‌ శ్రీనివాసనాయక్‌, డెమో రాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:37 AM