ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అటవీ సంరక్షణ వ్యూహాలపై అవగాహన పెంపొందించుకోవాలి

ABN, Publish Date - May 04 , 2024 | 01:38 AM

అధ్యయనయాత్రలో పాల్గొనే ప్రతీ బీట్‌ అధికారి ప్రత్యేకమైన శ్రద్ధతో అటవీ సంరక్షణ వ్యూహాలు, వన్యప్రాణుల నిర్వహణపై మంచి అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర అటవీ శిక్షణ అకాడమీ డైరె క్టర్‌ జి.కృష్ణప్రియ అన్నారు.

రాష్ట్ర అటవీ శిక్షణ అకాడమీ డైరెక్టర్‌ కృష్ణప్రియ

దివాన్‌చెరువు, మే3: అధ్యయనయాత్రలో పాల్గొనే ప్రతీ బీట్‌ అధికారి ప్రత్యేకమైన శ్రద్ధతో అటవీ సంరక్షణ వ్యూహాలు, వన్యప్రాణుల నిర్వహణపై మంచి అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర అటవీ శిక్షణ అకాడమీ డైరె క్టర్‌ జి.కృష్ణప్రియ అన్నారు. దివాన్‌చెరువులోని శిక్షణా అకాడమీలో ఫారెస్టు బీట్‌ అధికారుల ట్రైనీల బృందం ఐదురోజులు అధ్యయనయాత్ర శుక్రవారం ఉదయం అటవీ అకాడమీ నుంచి బయలు దేరింది. ఈ యాత్ర మారేడుమిల్లి, చింతూరు, పాడేరు, అరకు, విశాఖపట్నం, పరిసర ప్రాంతాలను బీట్‌ అధికారు ల సందర్శనార్థం ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మాట్లాడుతూ ఇటువంటి అధ్యయనయాత్ర వేర్వేరు ప్రాంతాల నుంచి శిక్షణ పొందుతున్న బీట్‌ అధికారులకు అటవీ సంరక్షణ విధానాలపై ఒక చక్కటి అనుభవాన్ని ఏర్పరుస్తుందన్నారు. ఈ యాత్ర సజావుగా జరిగేలా అకాడమీ నుంచి సీనియర్‌ ఫ్యాకల్టీ శ్రీనివాసరావు, వ్యాయామ శిక్షణా బోధకుడు ఆదాంరాజు, బృందం వెంట ఉన్నారని తెలిపారు.

ట్రైనీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌లకు టేకు చెట్లపై అధ్యయనం

మోతుగూడెం, మే 3: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫారెస్ట్‌ అకాడమీ నుంచి డీఎఫ్‌వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 30 మంది ట్రైనీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌లు లక్కవరం రేంజ్‌ పరిధిలో ఉన్న దబ్బగూడెం సెక్షన్‌లో ఉన్న వందేళ్ల నాటి టేకు చెట్లు అధ్యయనం కోసం వచ్చారు. వీరికి స్థానిక రేంజ్‌ ఆఫీసర్‌ జీవీ నానాజీ ఆధ్వర్యంలో దబ్బగూడెం సెక్షన్‌ ఆఫీసర్‌ అడపా మోహన్‌ సూర్యకిరణ్‌ స్వాగతం పలికారు. పొల్లూరు జలపాతంను సందర్శించి చుట్టుప్రక్కల ఉన్న చెట్లను చూసి భారీ వృక్షాల జీవితకాలాన్ని అంచనా వేశారు. చెట్ల పెంపకంలో పాటించాల్సిన మెలకువలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు సీలేరు వెళ్లారు.

Updated Date - May 04 , 2024 | 01:39 AM

Advertising
Advertising