ఉచిత డీఎస్సీ శిక్షణ
ABN, Publish Date - Oct 16 , 2024 | 12:21 AM
జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద అభ్యర్థులు డీఎస్సీలో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షణను ఏర్పాటు చేసిందన్నారు.
అమలాపురం టౌన్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద అభ్యర్థులు డీఎస్సీలో ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచిత శిక్షణను ఏర్పాటు చేసిందన్నారు. రెసిడెన్షియల్ ప్రాతిపదికన శిక్షణ ఇస్తామన్నారు. టెట్ ఉత్తీర్ణులై ఉంటే వారికి స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో 85 శాతం, టెట్‌లో పొందిన మార్కుల్లో 15 శాతం వెయిటేజీని ఇచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు మాత్రమే ఉండాలన్నారు. స్థానిక సచివాలయాల్లో ఆరు ప్రామాణిక అంశాలను పరిగణలోనికి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జన్మభూమి వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కోచింగ్ ఎంపిక కోసం ఆన్‌లైన్ స్ర్కీనింగ్ టెస్ట్‌ను ఈ నెల 27న నిర్వహిస్తామని జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు.
Updated Date - Oct 16 , 2024 | 12:21 AM