ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇప్పుడంతా డిజిటెల్‌!

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:29 AM

ఒకప్పుడు టీచర్లు బ్లాక్‌ బోర్డుపై పాఠాలను చెప్పేవారు. టెక్ట్స్‌ బుక్కులోని పాఠాన్ని అంశాలవారీగా తెల్లని చాక్‌పీసుతో నల్లని బోర్డుపై రాస్తూ విద్యార్థులకు వివరించేవారు.

రాజమహేంద్రవరం అర్బన్‌/తొండంగి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు టీచర్లు బ్లాక్‌ బోర్డుపై పాఠాలను చెప్పేవారు. టెక్ట్స్‌ బుక్కులోని పాఠాన్ని అంశాలవారీగా తెల్లని చాక్‌పీసుతో నల్లని బోర్డుపై రాస్తూ విద్యార్థులకు వివరించేవారు. ఇదంతా ఒకప్పటి మాట. కాలం మారింది. తరగతి గదుల్లో బ్లాక్‌బోర్డు చదువులకు కాలం చెల్లింది. మారిన కాలానికి అనుగుణంగా విద్యాబోధనలోను సమూల మార్పులు వచ్చాయి.సంప్రదాయ విద్యాబోధనకు స్వస్తిపలికి, డిజిటల్‌ విప్లవం వైపు బోధనా విధానం ముందుకెళుతోంది. నేడు మౌలా నా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల్లో విద్యా విధానంపై ప్రత్యేక కథనం..

సమయం ఆదా

గతంలో ఒక అంశాన్ని వివరించేందుకు ఉపా ధ్యాయులు తయారు చేసుకున్న బోధనోపకరణాలు, పాఠశాలలో చిరిగిన మేప్‌, విరిగిన గ్లోబు మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి ద్వారా అంత స్పష్టత, కచ్చితత్వం లేకపోవడం వల్ల ఒకపట్టాన అర్థం కాక సామాన్య విద్యార్థులు అవస్థలు పడేవారు. నేడు అదే అంశానికి సంబంధించిన దృశ్యాన్ని ప్రదర్శించడంతో సులభంగా అర్థం చేసుకునే వీలు కలుగుతోంది. దీనివల్ల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సమయం ఆదా అవుతోంది. ఇతర ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఆసక్తి కలిగించే విధంగా భిన్నమైన రీతిలో బోధన సాగించినా దాన్ని ఐఎఫ్‌పీల ద్వారా నెట్‌ వినియోగించి వారితో ముఖాముఖి పాల్గొనే అవకాశం విద్యార్థులకు కలుగుతోంది. ప్రపంచీకరణకు అనుగుణంగా విద్యార్థి విశ్వ మానవుడిగా రూపుదిద్దుకోవడానికి విద్యావ్యవస్థలో డిజిటలైజేషన్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

ఇసుక పలక నుంచి ఈ పలక

చింతూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కాలం మారుతోంది. మారుతున్న కాలాను గుణంగా జీవన విధానాలు మారుతున్నా యి. ఇసుక పలక నుంచి ఈ-పలక వరకు మార్పులొచ్చాయి. పూర్వం ఇసుకను పాఠ శాల ప్రాంగణంలో నేలపై చతురస్రాకా రం గా పరిచి దానిపై అక్షరాలను దిద్దించేవా రని పెద్దలు చెబుతుండేవారు.కాలక్రమంలో చెక్క ఫ్రేంతో కూడిన రాతి పలకలు, బలపాలు వచ్చాయి.ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్న పల్లెల్లో సైతం డిజిటల్‌ బోధన జరుగు తోం ది.కాసింత ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ఇళ్లల్లో ఈ-పలకలు పిల్లల చేతిలో కనిపిస్తు న్నాయి. విద్యార్థులకు తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధనా విధానాన్ని అనుసరి స్తున్నారు.మన్యంలో ఆదివాసీ చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ప్రభుత్వం కోయభారతి పేరిట పాఠ్యపుస్తకాలు ముద్రించి బోధన చేపట్టింది.ఈ ఏడాది చింతూరు డివిజన్‌లో 15 పాఠశాలల్లో ఈ తరహా బోధన సాగు తోంది.ప్రభుత్వం ఆదివాసీ యువతనే ఉపా ధ్యాయులుగా నియమించి వారికి నెలకు రూ.5 వేలు వంతున గౌరవ వేతనం చెల్లి స్తోంది.ఈ క్రమంలో ఒకటి నుంచి మూడో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో కోయ భారతిని బోధిస్తున్నారు.రానున్న కాలంలో పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది. తెలంగాణలో ఈ ఏడాది ఈ తరహా బోధ నకు 219 పాఠశాలలు ఎంపిక చేశారు.

సంపదకంటే విద్యగొప్పది

కాకినాడ రూరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మనదేశంలో విద్య అభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి మౌలానా అబుల్‌ కలాం అజాద్‌. ఆయన భారతదేశ మొదటి విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. నవంబరు 11న ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా మనదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.భారతదేశం స్వాతంత్య్రం పొందిన వెంటనే దేశంలోని పాఠశాల విద్యావిధానంలో మరో పెద్ద మార్పు కనిపించింది.కొత్తగా ఏర్పా టైన రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా 6 నుంచి 14 ఏళ్లు వయస్సు గల పిల్లలందరికీ ఉచిత పాఠశాల విద్య అందించాలనే లక్ష్యంతో ఉంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 45లో నిర్ధేశిక విధానంగా ఉన్న వాస్తవం నుంచి చూడవచ్చు.

బోధనా పద్ధతులు రెండు రకాలు

1.ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం

మొదటి దానిలో ఉపన్యాస పద్ధతి, ప్రదర్శనా పద్ధతి ఉంటాయి.

2.విద్యార్థి కేంద్రీకృత ఉపగమం.

రెండో దానిలో క్రీడా పద్ధతులు, డాల్టన్‌ పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత ఉపగమంలో శాస్త్రీయ పద్ధతి, ఆగమన, నిగమన, సంశ్లేషణ, విశ్లేషణ, ప్రయోగశాల, సమస్యా పరిష్కార, అన్వేషణ పద్ధతులున్నాయి.

ఏమిటీ ఐఎఫ్‌పీ పానల్స్‌..

పాఠశాలల్లో బ్లాక్‌బోర్డు స్థానంలో ఆడియో, వీడియో, టీవీల్లో బోధన జరిగేది. ఇప్పుడు మరింత అడ్వాన్సు టెక్నాలజీ తరగతి గదుల్లోకి ప్రవేశించింది. ఒకప్పుడు కన్నాలు పడిన నల్లబల్లపై పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు, నేడు తరగతిలో ఐఎఫ్‌పీల ద్వారా దృశ్య, శ్రవణ మాధ్యమంలో అంశాలు నేర్చుకుంటున్నారు. గ్రీన్‌బోర్డు, ఫ్లాట్‌ పానల్స్‌, ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌) విధానంతో స్మార్టు టీవీలు రావడంతో తరగతి గదుల్లో బోధనలో తీరుతెన్నులే మారిపోతున్నాయి. సోషల్‌ మీడియాలో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి.ఈ విధానంలో ఉపాధ్యాయుడు డైరెక్ట్‌గా ఇంటర్నెట్‌ నుంచి మరింత కంటెంట్‌ను తీసుకొచ్చి పిల్లలకు విపులంగా బోధించే వెసులుబాటు ఉంటుంది. ఈ విధానంలో ఉపాధ్యాయుడు టెక్ట్స్‌బుక్‌లోని కంటెంట్‌కు అదనంగా విస్తృతమైన సమాచారాన్ని విద్యార్థికి అందించే వీలుంటుంది. ఐఎఫ్‌పీ ప్లాట్‌ పానల్స్‌ విధానంలో వాట్సాప్‌, గూగుల్‌తోపాటు యూట్యూబ్‌ కూడా ఉంటుంది.రాష్ట్రంలో దాదాపు అన్ని హైస్కూళ్లలో ఈ ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఎలిమెంటరీ స్కూళ్లలో అక్కడక్కడా తప్ప చాక్‌పీసు, బ్లాక్‌బోర్డు విద్యాబోధన లేదు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ పానల్స్‌ రాకతో బోధన రూపురేఖలే మారిపోయాయి. ఈ విధానంలో బోధన పిల్లలకు మరింత అడ్వాంటేజ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎఫ్‌టీ కంటే ముందు గ్రీన్‌బోర్డులు, ఫ్లాట్‌ఛానల్స్‌ అందుబాటులోకి వచ్చినా వాటి ద్వారా బోధన పరిమితుల పరిధిలోనే జరిగేది. గ్రీన్‌బోర్డు ఒక్కోసారి ఫ్లాట్‌పానల్‌గాను, స్ర్కీన్‌గాను ఉపయోగించేకునే వీలుంటుంది. ఐఎఫ్‌పీ పానల్స్‌తో బోధన అడ్వాన్స్‌గా మారింది.

సబ్బుబిళ్లపై అబుల్‌ కలామ్‌ అజాద్‌

గొల్లప్రోలు రూరల్‌, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): సోప్‌ కార్వింగ్‌ ద్వారా సబ్బు బిళ్లపై డాక్టర్‌ మౌలానా అబుల్‌కలామ్‌ అజాద్‌ చిత్రాన్ని చెక్కి చిత్రించారు గొల్లప్రోలు మండలం చెందుర్తి మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లి గోవిందరాజులు. జాతీయ విద్యాదినోత్సవాన్ని పురస్కరించుకుని అజాద్‌ చిత్రాన్ని చెక్కినట్లు గోవిందరాజులు తెలిపారు.విద్యార్థులకు అజాద్‌ గురించి,విద్యామంత్రిగా ఆయన చేసిన సేవలు గురించి వివరిస్తానని చెప్పారు

Updated Date - Nov 11 , 2024 | 01:29 AM