ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సినీ ఫక్కీలో...

ABN, Publish Date - Nov 11 , 2024 | 01:11 AM

కారులో గంజాయి తరలిస్తూ వాహన తనిఖీల్లో పోలీసులను తప్పించుకునే యత్నంలో పరారవుతుండగా గ్రామస్తులు వెంబడించడంతో ఎట్టకేలకు దొరికిపోయాడు నిందితుడు. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

తప్పించుకునే యత్నంలో ఎటపాకలో వీధిలో మేకల గుంపుని ఢీకొట్టిన కారు

అనుమానాస్పదంగా ఉండడంతో వెంబడించి పట్టుకున్న ఎటపాక గ్రామస్తులు

నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసిన వైనం

100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎటపాక పోలీసులు

ఎటపాక, నవంబరు 10: కారులో గంజాయి తరలిస్తూ వాహన తనిఖీల్లో పోలీసులను తప్పించుకునే యత్నంలో పరారవుతుండగా గ్రామస్తులు వెంబడించడంతో ఎట్టకేలకు దొరికిపోయాడు నిందితుడు. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బొజ్జిగుప్ప నుంచి ఎటపాక మీదుగా భద్రాచలం వైపు వస్తున్న కారును పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కారును ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో పోలీసులు అనుమానంతో వెంబడించారు. దాంతో గంజాయి స్మగ్లర్లు తప్పించుకునే యత్నంలో కారును ఎటపాకలోని గొల్ల బజారు వీధిలోకి తిప్పారు. ఆ సమయంలో రహదారిపై మేకల గుంపును, ఆ తర్వాత పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టారు. మేకల కాళ్లు విరగడంతో కాపరి కారుపై రాళ్లు విసిరాడు. అనంతరం కేకలు వేయడం, కారు అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామస్తులు ఆ కారు వెంటపడ్డారు. ఎటపాక నుంచి మేడువాయి మార్గంలో వెళ్లే ప్రయత్నం చేసి చివరకు రహదారి సౌకర్యం లేక కారు ఆగిపోవడంతో గ్రామస్తులు పట్టుకున్నారు. ఇద్దరిలో ఒకరు పరారు కాగా మరొక వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, నిందితుడితో పాటు కారుని స్వాధీనం చేసుకున్నారు. అందులో 100 కిలోల గంజాయి మూటల్లో వున్నట్టు సమాచారం. కాగా పారిపోయిన నిందితుడిని కూడా తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గంజాయి రవాణాలో సూత్రధారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2024 | 01:11 AM