ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదారంతా గరళమే..!

ABN, Publish Date - Nov 20 , 2024 | 02:08 AM

ఒకనాడు గోదావరి కాలువల్లో నీటిని చేతితో ఒడిసిపట్టి తాగేవాళ్లం.. ఇప్పుడు ఆ నీరు తాగాలంటేనే భయమేస్తోంది.. ఇదీ ఒక 70 ఏళ్ల పెద్దాయన మాట.. మేం గతంలో గోదావరి కాలువల నీటినే బిందెలతో తెచ్చుకుని తాగేవాళ్లం.. ఇప్పుడు నీటిని కొనుక్కుని తాగుతున్నాం.. ఇదీ 60 ఏళ్ల బామ్మ మాట.. ఎందుకంటే నాటికి నేటికి గోదావరి కాలువల నిర్వహణలో ఎంతో తేడా ఉంది.

ఈ వ్యర్థం.. అనర్థమే : కాలువలను కలుషితం చేస్తున్న వ్యర్థాలు

  • 175 ప్రాంతాల్లో కాలువలు కలుషితం

  • రెండేళ్ల కిందటే అధికారుల నివేదిక

  • నాటి సీఎం రూ.100 కోట్ల హామీ

  • రూపాయి కూడా విదల్చని వైనం

  • కాలుష్య రహితం చేస్తామని గొప్పలు

  • అటకెక్కిన ‘మిషన్‌ క్లీన్‌ గోదావరి’

  • ఉమ్మడి జిల్లాలకు కలుషిత నీళ్లు

  • వేలాది మందికి ఈ నీళ్లే దిక్కు

  • నేటికీ మారని తీరు

  • ఎక్కడికక్కడ యథేచ్ఛగా వ్యర్థాలు

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

ఒకనాడు గోదావరి కాలువల్లో నీటిని చేతితో ఒడిసిపట్టి తాగేవాళ్లం.. ఇప్పుడు ఆ నీరు తాగాలంటేనే భయమేస్తోంది.. ఇదీ ఒక 70 ఏళ్ల పెద్దాయన మాట.. మేం గతంలో గోదావరి కాలువల నీటినే బిందెలతో తెచ్చుకుని తాగేవాళ్లం.. ఇప్పుడు నీటిని కొనుక్కుని తాగుతున్నాం.. ఇదీ 60 ఏళ్ల బామ్మ మాట.. ఎందుకంటే నాటికి నేటికి గోదావరి కాలువల నిర్వహణలో ఎంతో తేడా ఉంది.. ప్రస్తుతం కాలువలు కాలుష్య కాసారాలుగా మారిపోయాయి.. నీళ్లు తాగడం కాదు.. స్నానం చేయడానికే భయపడేంతగా నీళ్లు కలుషితమయ్యాయి.. రెండేళ్ల కిందట ఈ విషయం గుర్తించినా గత వైసీపీ ప్రభుత్వం మాటలు తప్ప.. అలాగే వదిలేసింది.. ఈ విషయం తెలియని ప్రజలు ఆ నీటినే తాగి రోగాల బారినపడ్డారు.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్లీన్‌ గోదావరిపై దృష్టి సారించాల్సి ఉంది.. లేదంటే మరింత ప్రమాదం ముంచుకొస్తుంది..!

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిషన్‌ క్లీన్‌ గోదావరి ప్రాజెక్టు అటకెక్కిపోయింది. నాలుగేళ్ల నుంచీ పనుల్లో అతీగతీలేక ఎక్కడిదక్కడే అన్నట్లు ఆగిపోయింది.ఉమ్మడి జిల్లాలో 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కాలువలు కాలుష్య కాసా రాలుగా మారిపోయిన నేపథ్యంలో వాటిని శుద్ధి చేస్తామని ప్రకటించి గత వైసీపీ సర్కారు గాలికొ దిలేసింది.ఈ నీటిని శుద్ధి చేశాకే పంట కాలు వల్లోకి నీరు వదులుతామని ప్రగల్భాలు పలి కింది. ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తు న్నట్టు గొప్పలు చెప్పిన అప్పటి సీఎం జగన్‌ తీరా నిధుల మంజూరును కాగితాలకే పరిమితం చేశా రు.కానీ క్షేత్రస్థాయిలో గత నాలుగేళ్లుగా కనీసం పట్టించుకోకపోవడంతో కాలువలు దయనీయంగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 175 చోట్ల గోదావరి కాలువల వద్ద కాలుష్యం తీవ్రంగా ఉం దని గుర్తించారు. కూటమి ప్రభుత్వం కాలువల బాగుపై దృష్టిసారించాలని అన్నదాతలు కోరుతు న్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన మిషన్‌ క్లీన్‌ గోదావరి కార్యాలయం ఇప్పటికీ కొనసాగు తున్న నేపథ్యంలో కార్యాచరణ చేపట్టాల్సిన అవస రం ఉందని అటు జలవనరులశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ఎక్కడికక్కడ భయానకం...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ప్రధాన కాలువలు తూర్పు,మధ్యడెల్టాల పరిధిలో 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మధ్య డెల్టా కింద కోనసీమ,తూర్పుడెల్టా కింద ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు కాలువలు, డ్రైన్ల ద్వారా గోదావరి నీరు ప్రవహిస్తోంది. ఈ నీళ్లు లక్షల ఎకరాల సాగు,తాగునీటికి ఆధారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా గోదావరి కాలువలు కాలుష్యకాసారాలుగా మారిపోయాయి. వీటి వెం బడి ఉన్న వందలాది గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. గృహనిర్మాణ వ్యర్థాలు,చికెన్‌, మద్యం దుకాణాల మొదలు క్షవరశాలలు, వందలాది వాణిజ్య దుకాణాల్లో వ్యర్థాలను కాలువల్లో వదిలేస్తున్నారు. కడియం నుంచి కాకినాడ వరకు, ఆత్రేయపురం నుంచి అమలాపురం వరకు కాలువలకు సమీపంలో వందలాది కోళ్లఫారాలు ఉ న్నాయి. వీటిల్లోని వందల టన్నుల వ్యర్థాలను డ్రమ్ముల్లో తెచ్చి డంపింగ్‌ చేస్తున్నారు. అనపర్తి, కడియం, బిక్కవోలు, ద్వారపూడి, సామర్లకోట, కాకినాడ, కోనసీమ పరిధిలోని కాలువల్లో ఈ తర హా వ్యర్థాలు కలిపేస్తు న్నారు. కోనసీమ పరిధిలో రొయ్యల చెరువుల్లో వాడిన నీటిని పైపులతో గోదావరి కాలువలకు మళ్లిస్తున్నారు.ఇలా ఎక్కడికక్కడ కాలువలు విషమయం అవుతుండగా, ఆ నీటిని తాగే మూగజీవాలు తరచూ మృత్యువాత పడుతున్నా బయటకు తెలియడం లేదు. పంచాయతీల పరిధిలోని మురుగుకాలువల నీటినీ కాలువల్లోకే తరలిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే రాజమహేంద్రవరం నుంచి సామర్లకోట వరకు కాలువలకు సమీపంలో ఎన్నో పరిశ్రమలున్నాయి. వీటిలో కాలుష్య జలాలను శుద్ధిచేసి భూమిలోకి వెళ్లేలా చేయాలి. కానీ ఖర్చు సాకుతో గుట్టుగా పైపుల్లోంచి గోదావరి కాలువల్లోకి కలిపేస్తున్నారు. రాజమహేంద్రవరంలో మురుగునీటిని నల్లా ఛాన ల్‌ ద్వారా గోదావరిలో కలిపేస్తారు. కలుషితం అని తెలిసినా ఈ నీటినే ఓ మోస్తరు శుద్ధిచేసి పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రజలకు తాగునీటిగా సరఫరా చేస్తున్నాయి.

కూటమి..పట్టాలెక్కించాలి..

కూటమి ప్రభుత్వం గోదావరి కాలువలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టుకు ఇటీవల ఓ ఐఏ ఎస్‌ను కూడా సర్కారు నియమించింది.దీంతో ఎంతో కొంత నిధులు, లేదా కంపెనీల సీఎస్‌ ఆర్‌ నిధుల సాయంతో కాలువల ప్రక్షాళన చేయాల్సి ఉంది.ఇదే విషయమై జలవన రుల శాఖ సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. మిషన్‌ క్లీన్‌ గోదావరి ప్రాజెక్టుకు గత ప్రభు త్వం పైసా కూడా ఇవ్వని నేపథ్యంలో ఏం చేయలేకపోయామని దీంతో కాలుష్య తీవ్రత మరింత పెరిగిందని వివరించింది.కూటమి ప్రభుత్వం గోదావరి కాలువల్లో కాలుష్యాన్ని నివారించే ప్రాజెక్టును పట్టాలెక్కి స్తుందని ఆయాశాఖల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

నాడు గాలికొదిలేసిన వైసీపీ

గత వైసీపీ సర్కారు మిషన్‌ క్లీన్‌ గోదావరి పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును 2019 సెప్టెం బరులో ప్రారంభించింది.సీఎం చైర్మన్‌గా ఉండే ఈ బోర్డు ద్వారా జిల్లాలో గోదావరి కాలువ లను శుద్ధి చేసి,ఆ తర్వాతే నీటిని కాలువల్లోకి వదులుతామని.. రూ.100 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు అప్పటి సీఎం జగన్‌ పలు సమీక్షల్లో గొప్పగా ప్రకటించారు.ఈ మేర కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాలువల వద్ద ఎక్కడెక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో అధ్య యనం చేశారు. తీరా నిధులు అవసరమైన తరుణంలో అప్పటి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా నిధులు మంజూరు చేయలేదు. కేవలం నిధు లిస్తున్నట్టు కాగితాలపై ఆదేశాలు జారీచేశారు. ఇలా మొన్న దిగిపోయే వరకు వైసీపీ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుపై మాటలు తప్పించి పనులు జరిగేలా కనీస శ్రద్ధ చూప లేదు. దీంతో మిషన్‌ క్లీన్‌ గోదావరి ప్రాజెక్టు పూర్తిగా అటకెక్కినట్లయ్యింది. గత ఐదేళ్లలో గోదావరి కాలువల నిర్వహణను జగన్‌ సర్కారు గాలి కివదిలేసింది.అటు పూడిక పెరగడం, మరో పక్క కాలుష్య తీవ్రత మరింత పెరిగి ప్రస్తు తం అత్యంత హానికరంగా తయారయ్యాయి.

175 చోట్ల విషతుల్యం..

తూర్పు,మధ్య డెల్టాల పరిధిలో 175 చోట్ల గోదావరి కాలువల్లో నీళ్లు విషతుల్యంగా మారిన ట్టు నీటిపారుదలశాఖ రెండేళ్ల కిందటే గుర్తించింది.కాలువల వెంబడి వ్యర్థాలపై డ్రోన్లతో పం చాయతీలు,మునిసిపాల్టీలు సర్వే చేశాయి. అత్యధికంగా కోనసీమలో కోళ్లు,రొయ్యల వ్యర్థాలు, కడి యం,ద్వారపూడి,అనపర్తి,బిక్కవోలు,సామర్లకోట పరిధిలో 68 చోట్ల కాలువలు నీళ్లు వ్యర్థాలతో విషపూరితంగా మారినట్టు నిర్ధారించారు. కొన్నిచోట్ల పరిశ్రమల నుంచి కాలుష్య జలాలు నేరుగా కలిసిపోతున్నట్టు తేల్చారు.ఇవన్నీ పంటపొలాలకు చేరడంతో పంటలు నష్టపో వడం,భూగర్భ జలాలు సైతం కలుషితమైనట్టు ఆయాశాఖలు తేల్చాయి. కాలువలు కాలుష్యంగా మారినచోట వ్యర్థాల రీసైక్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అప్పట్లో ప్రయత్నిం చారు.కానీ అప్పటి ప్రభుత్వం ప్రచారం కోసం మినహా పైసా కూడా ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలన్నీ మూలనపడ్డాయి.

Updated Date - Nov 20 , 2024 | 02:08 AM