ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా రాష్ట్రం: మంత్రి సుభాష్‌

ABN, Publish Date - Sep 22 , 2024 | 01:04 AM

సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే విజయవాడ వరద బాధితుల కోసం మూడు రోజుల్లో రూ.350కోట్లు దాతలు ఇచ్చారని మం త్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.

రామచంద్రపురం(ద్రాక్షారామ), సెప్టెంబరు 21: సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే విజయవాడ వరద బాధితుల కోసం మూడు రోజుల్లో రూ.350కోట్లు దాతలు ఇచ్చారని మం త్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శనివారం రాత్రి పట్టణంలో 12.13.14,15,16 వార్డుల్లో జరిగిన మనది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సుభాష్‌ మాట్లాడారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏఆపద వచ్చినా ఈస్థాయిలో విరాళాలు ఇచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకురాలేదన్నారు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ నేతలపై నమ్మకం లేకపోవడమేనన్నారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన ప్రజోపయోగ కార్యక్రమాలు చూస్తే రానున్న కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడం ఖాయమన్నారు. వంద రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు మంత్రి వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు కాకినాడ రామారావు, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్‌, జనసేన పట్టణ కార్యదర్శి గొల్లపల్లి కృష్ణ, నాయుడు మాస్టారు. న్యాయవాది లకాని పద్మకమల కుమారి మాట్లాడారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గరిగిపాటి సూర్యనారాయణమూర్తి, మాజీ కౌన్సిలరు దంగేటి గౌరీశంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు మేడిశెట్టి సూర్యనారాయణ, కట్టా నాగేశ్వరరావు, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు జాస్తి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 01:04 AM