నైపుణ్యాలను పెంపొందించుకునేందుకే స్మార్క్
ABN, Publish Date - Sep 20 , 2024 | 12:49 AM
ఆధునిక వైద్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతీ వైద్య విద్యార్థికి ఉందని కళాశాల పూర్వ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు, డాక్టర్ ఎంబీఆర్ శర్మ అన్నారు.
అమలాపురంరూరల్, సెప్టెంబరు19: ఆధునిక వైద్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతీ వైద్య విద్యార్థికి ఉందని కళాశాల పూర్వ డీన్ డాక్టర్ ఏఎస్ కామేశ్వరరావు, డాక్టర్ ఎంబీఆర్ శర్మ అన్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో మూడు రోజుల పాటు జరిగే దక్షిణ భారత వైద్య విద్యార్థుల వార్షిక ప్రయోగాత్మక అవగాహన సమ్మేళనం (స్మార్క్) సమావేశాలను గురువారం కళాశాల డీన్ డాక్టర్ ఆనంద్ ఆచార్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసమావేశాల ద్వారా వైద్య విద్యార్థులు పరిశోధనా పత్రాలు సమర్పించడంతో పాటు పోస్టర్ ప్రజెంటేషన్ల ద్వారా తమ నూతన ఆవిష్కరణలను వివరించవచ్చునన్నారు. వివిధ కళాశాలల నుంచి వెయ్యి మందికి పైగా వైద్య విద్యార్థులు వర్కుషాపులో పాల్గొన్నారు. నిర్వాహకులను కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎండీ రవికిరణ్‌వర్మ అభినందించారు. ఈ సమావేశాలకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ప్రవీణ్ మాస్క్‌ను పరిశీలకునిగా నియమించారు.
Updated Date - Sep 20 , 2024 | 12:49 AM