ప్రభుత్వ ఉద్యోగ సంఘాల బల ప్రదర్శన
ABN, Publish Date - Dec 15 , 2024 | 01:03 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాదంటే మాదంటూ రెండు వర్గాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. కెఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులను బహిష్కరించగా తామే సూర్యనా రాయణను బహిష్కరించినట్టు ఆస్కారరావు తదితరులు చెప్పుకోవడంతో పాటు సూర్యనారాయణకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరానికి చెందిన శ్రీకాంత్‌రాజును ప్రె
ఒక సంఘం మహాసభ.. మరొక సంఘం వనభోజనాలు
మంత్రి, ఎమ్మెల్యేలకు ఆహ్వానం
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మాదంటే మాదంటూ రెండు వర్గాలు వాదులాడుకుంటున్న సంగతి తెలిసిందే. కెఆర్ సూర్యనారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యనారాయణ సంఘం నుంచి ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తదితరులను బహిష్కరించగా తామే సూర్యనా రాయణను బహిష్కరించినట్టు ఆస్కారరావు తదితరులు చెప్పుకోవడంతో పాటు సూర్యనారాయణకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరానికి చెందిన శ్రీకాంత్‌రాజును ప్రెసిడెంట్, ఆస్కారరావు ప్రధాన కార్యదర్శిగా సంఘం నడుపుతున్నారు. గత 3 నెలలుగా వారి మధ్య బాగా విభేదాలు పెరిగాయి. సూర్యానారాయణ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్థానిక జెకె గార్డెన్‌లో ఉద్యోగుల మహా సభ నిర్వహించింది. దానికి పోటీగా శ్రీకాంత్‌రాజు తదితరులు ప్రముఖ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో అని చెబుతూ పుష్కర వనంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఇరువర్గాలు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ఆది రెడ్డి శ్రీనివాస్‌లను ఆహ్వానించారు. 2చోట్లకు నాయకులు హాజరయ్యారు. ఈ రెండు సంఘాల మధ్య కోర్టు కేసులు కూడా ఉన్నట్టు సమాచారం. సంఘ నేతల మధ్య ఆఽధిపత్య పోరు వల్ల అసలు మేలు జరుగుతుందా లేక ఈ సంఘాలు నామమాత్రంగానే తమ పబ్బం గడుపుకుంటాయా అనే అనుమానాలు ఉద్యోగుల్లో ఎక్కువయ్యాయి.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14( ఆంధ్ర జ్యోతి): గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసింది.. ఆ పరిస్థితులను అధిగమిం చి రాష్ట్ర ప్రగతిని సాధించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్.సూర్యనారాయణ అన్నారు. తూ ర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో శనివారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రమేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత తమ సంఘ జిల్లా కమిటీలు ఏర్పా టు చేసుకుని సభ్యత్వాలు నమోదు ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు 76శాతం మంది ఉద్యోగు లు సభ్యత్వాలు తీసుకుని సంఘాన్ని మరింతగా ప్రోత్సహించారని తెలిపారు. ఉద్యోగుల సమస్య లు, ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు, డీఏ బ కాయిలు, ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇవ్వడం తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని బట్టి సమస్యల పరిష్కారానికి కాలవ్యవధి పెట్టుకోవాలన్నారు. వేతన సవరణకు సంబ ంధించి కమిషన్ వేయడంలో న్యాయబద్ధంగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని నియమించా లని ప్రభుత్వాన్ని కోరారు. సభకు హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌లకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందిం చారు. ఉద్యోగ సమస్యలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తప్పక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం ఏపీజీఈఏ జిల్లా నూతన అధ్యక్షుడిగా పి.గిరిప్రసాద్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్‌ఎస్ విల్సన్‌పాల్, సహాధ్యక్షుడిగా చాంబర్లీన్, జిల్లా ఉపాధ్యక్షులుగా రవికుమార్, రా జారావు, కార్యదర్శిగా రమేష్, దినేష్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏపీజీ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కేదారీశ్వరరావు, వీఆర్‌వోల సంఘ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు, ఉద్యోగుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి బాజీపఠాన్, వ్యవసాయ ఉద్యో గుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీవీ.రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి సేవకుడిలా కృషి
మంత్రి కందుల దుర్గేష్
దివాన్‌చెరువు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి సేవకుడిలా కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.శ్రీకాంత్‌రాజు, ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి ఉద్యోగ వేదిక సమస్యల పరిష్కారాలు వనభోజనం అనే కార్యక్రమానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మహాజనసభలో ఉద్యోగులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించిన డిమాండ్లను జాబితాను వారికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ, జీపీఎస్ అమలుపై గత ప్రభుత్వం కాలయాపన చేసిందని కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించుకుని కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. వనభోజనాలు కుల భోజనాలుగా మారిన ఈ రోజుల్లో ఉద్యోగులంతా కలసి నిర్వహించుకుంటున్న ఈ వనభోజనాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వమని, ఉద్యోగస్తులందరికీ మంచి జరుగుతుందన్నారు. శ్రీకాంత్‌రాజు, ఆస్కారరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులకు అనేక రకాల ఆశ చూపి రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు. నేటికీ అనేక డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి ఖాతాల్లో సొమ్మును విత్‌డ్రా చేసుకునే, లోన్‌లు పొందే అవకాశాన్ని పునరుద్ధరించాలన్నారు. కేవలం ఒక వ్యక్తి వల్లనే సంఘం అనేక ఒడిదుడుకులకు లోనుకావడం సంఘాల చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఏడాది జూలై 26న సంఘ అధ్యక్షుడిగా కేఆర్ సూర్యనారాయణ సంఘ బహిష్కరణను ఆమోదించడం, ఉద్యోగభద్రతకు పాటుపడడం, ఇబ్బడిముబ్బిడిగా పెరిగిపోయిన మొబైల్‌యాప్‌లను తొలగించాలి తదితర తీర్మానాలను ఆమోదించామని వారు తెలిపారు. అనంతరం వనభోజనాలు జరిగాయి. ఉద్యోగులు ఆడిపాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్యఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, వీఆర్వో, సచివాలయ ఉద్యోగులు తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన నాయకులు, దా దాపు 1500 మంది ఉద్యోగులు హాజరయ్యారు.
Updated Date - Dec 15 , 2024 | 01:03 AM