ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువ జరగాలి

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:04 AM

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచించారు. రాజానగరం మండలం పాలచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాలచర్ల పీహెచ్‌సీలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

  • పాలచర్ల పీహెచ్‌సీ తనిఖీలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు

దివాన్‌చెరువు, నవంబరు29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సూచించారు. రాజానగరం మండలం పాలచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్‌ఎంఐఎస్‌, ఈహెచ్‌ఆర్‌ తదితర రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్లతో బాటు ఐపీ సంఖ్య కుడా పెరగవలసి ఉందని చెప్పారు. ఆయా గ్రామ సచివాలయాల జనాభాకు తగ్గట్టుగా ఐయూడీలు ఉండాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్లు బెనడిక్ట్‌, శ్రీరాణి, డీఎంహెచ్‌వో కార్యాలయ డాక్టర్లు షమ్మీకుమార్‌, నిశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • ఎయిడ్స్‌ నియంత్రణపై విస్తృత అవగాహన

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండు ఆవరణలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐఈసీ మెటీరియల్‌తో కూడిన అవగాహన స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ లక్ష్యంగా వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ వసుంధర మాట్లాడారు. జిల్లా నూక్లియస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మానస, నారీ సాక్ష్యం, వైఆర్‌జీ కేర్‌ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:04 AM